పుట:Ammanudi-June-2019.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"నొ...నొ...ఐ వోంట్‌ గో ఎనీ వేర్‌. చేతికందిన దిండ్లన్నీ విసిరేశాడు. దుప్పటిని నేలమీద పడేసి కాళ్ళతో తొక్కాడు...”

“ఆర్‌ యూ మాడ్‌.” అరిచింది మాయ. “ఎస్‌ మామ్‌ ఐ యామ్‌ మాడ్‌... గెట్‌ లాస్ట్‌...”

మళ్ళీ అరిచాడు. ఎప్పుడూ ఎంతో సౌమ్యంగా ఉండే రాజు అలా ఎందుకు అరుస్తున్నాడో అర్ధం చేసుకునే ప్రయత్నం చేలనిపించా దామెకు. ఎప్పుడూ లేనిది తనను ఇట్లా ఎదిరిస్తాడా అని వెరైక్కి పోయిందామే.

“ఓసారిలా వస్తారా...?” హుంకరించింది. ఏమయ్యిందా అని హడలిపోయి ఒక్క ఉదుటున వచ్చాడు ఆమె భర్త మారుతిరావ్‌.

“వాట్‌ ఈజ్‌ దిస్‌. ఏంటి మీ అబ్బాయి నిర్వాకం.? రాత్రి వాడికి చెప్పలేదా సమ్మర్‌ స్కూల్‌ గురించి?”

“లేదు మాయ. నేను వచ్చేటప్పటికే వాడు నిద్రపోతున్నాదు. రేపు చెబ్దామని ఆగాను”

“ఏమిటి రేపు చెప్పేది. మనం ఆలస్యం చేస్తే అంత ప్రిస్టేజియాస్‌ స్కూల్‌ లో సీట్లు ఉంటాయా...? అయినా మనం చెప్పగానే హి హాజ్‌ టూ ఫాలో దట్సిట్‌...

“ఆ మాయా...డోంట్‌ వర్రీ. ఇట్స్‌ ఓన్లీ సమ్మర్‌ స్మూల్‌..యూ నో...

“అదిగో మళ్ళీ. పేరెంట్స్‌ మీటింగ్‌ లో ఏమన్నారు? మీవాడు దేనికీ సరిగ్గా రెస్పాండ్‌ అవ్వడం లేదు. ఫ్లూయెన్సీ లేనేలేదు అని చెప్పడం లేదా...? ఎన్నాళ్ళు వాడు తర్డ్‌...ఫోర్త్‌ రాంక్‌ లో ఉండిపొతాడు. అస్సలు మీరు కేపబుల్‌ అయితే ఇవ్వన్నీ నా తల మీదకు వచ్చేవా... ? ఆమెను అలా వది లేస్తే ఇంకా చాలా దారుణంగా మాట్లాడు తుంది అని తెలుసు.

“రాజూ నాన్నా..! వాట్‌ హపెంద్‌. కమాన్‌ గెట్‌ అప్‌...” మారుతీరావ్‌ అనునయంగా అరిచాడు. బిగదీసుకుని పడుకున్న రాజు కదలలేదు. “రాజూ మమ్మీ చెప్తున్నది కదా గెట్‌ రెడీ ఫర్‌ నమ్మర్‌ క్లాసేస్‌...” మారుతీ రావ్‌ మళ్ళీ బతిమాలాడు.

“నొ...” రాజు రివ్వున లేచాడు. “నో...నో ఐ డోంట్‌ వాంటూ గో ఎనీ వేర్‌.”

“నో రాజూ...డొంట్‌ సే లైక్‌ దట్‌ నీకు. సాయంత్రం నిన్ను వుడ్‌ కోర్ట్‌ కి తీసుకెళ్తాను సరేనా.”

“నో...ఐ డోంట్‌ వాంట్‌ ఇటొ

“పొనీ జల విహార్‌..?”

“నో...నో...ఐ డోంట్‌ వాంటూ గో ఎనీ క్లాసెస్‌. ఐ డొంట్‌ వాంటూ కమ్‌ ఎనీ వేర్...

“ఆర్‌ యూ మాడ్. ట్వంటీ థౌజండ్స్‌ అడ్వాన్స్‌ పే చేసాను అక్కడ...” అరిచింది మాయా

“గో టు హెల్‌...” అంత కంటే గట్టిగా అరిచాడు రాజు అంతే మాయ లేచి వచ్చి పిచ్చిదానిలా రాజు చెంపలు వాయించి వాయించి కొట్టింది...

మారుతీ రావ్‌ అక్కడలేకుంటే రాజును ఏమి చేసేదో అన్నంత వెర్రిగా కొట్టేసింది.

మారుతీరావ్‌ ఆమెను బలవంతంగా కిందకు తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. ఆమెకు మంచినీళ్ళు ఇచ్చి కొడుకు దగ్గరకు పరుగు పెట్టాడు. రాజు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడుస్తూ...డోంట్‌ కమ్‌ టూ మీ..ఐ హేట్‌ యూ ఐ హేట్‌ ఆల్‌ ఆఫ్‌ యూ.”

ఏడుస్తూ అరుస్తున్నాడు ఆ మంచం మీదే దొర్లి దొర్లి ఏడుస్తున్నాడేగానీ తండ్రిని దగ్గరకు రానివ్వలేదు.

మారుతీరావ్‌ మళ్ళీ కిందకు వెళ్ళాడు మాయ

....ఏంటీ హేట్‌ యూ అంటాడా...? వీడి కోసం, వీడి చదువులకోసం ఎంత ఖర్చు పెడుతున్నాం... ఇప్పుడు హాయిగా ఇంట్లో కూర్చోలేక మళ్ళీ వీడి సమ్మర్‌ స్కూల్‌ కోసం బోలెడు డబ్బు ఖర్చుపెట్టి మళ్ళీ వీడిని తీసుకెళ్ళడం తీసుకురావడం ఇదంతా వాడికి మాడ్‌ గా కన్సడుతున్నదా...? వాడు మనలను హేట్‌ చేస్తున్నాడా?” చేతుల్లో ముఖం దాచు కుని బొరుబోరున ఏడవసాగింది. అకస్మాత్తుగా యుద్ద వాతావరణంలా మారిపోయిన ఇంటిని చూసి అయోమయంలో పడిపోయాడు మారుతిరావ్‌...

“చూడు మాయా. వాడికి ఏ క్రికెట్‌ మ్యాచ్‌ లోనో చేరాలానుందేమో. కాస్త సమయమిస్తే వాడే మెల్లగా సర్ధుకుంటాడు.”

“ఎంటండి సర్జుకునేది. చిన్నపిల్లాడు వాడు...వాడికేమి తెలును ఇది పోటీ ప్రపంచం. వి మస్ట్‌ బీ ఎలర్ట్‌ ఫర్‌ ఎవ్రీ మినేట్‌.”

మారుతీరావ్‌కి ఏమిచెయ్యాలో అర్ధం కాలేదు. దగ్గరకు వస్తే దిండ్లూ దుప్పట్లూ విసిరేస్తూ నానా అరుస్తూ ఏడుస్తూ భీభత్సం చేస్తున్నాడు రాజు. రోజులు గడిచిపోతున్నాయి. మంచి ప్రిస్టేజ్‌ స్కూల్‌ ల్లో క్లాస్‌ లన్నీ అయిపోతున్నాయి ఇప్పుడెలా అని పిచ్చెక్కి పోతున్నది మాయకు.

దిండ్లూ దుప్పట్లూ విసరడమే కాక ... ఇప్పుడు కొత్తగా తల బాదుకుంటూ ఏడుస్తున్నాడు రాజు. అన్నం కూడా సరిగ్గా తినడం లేదు. స్నానం చేసి మూడురోజుల య్యింది. మాయా వాళ్ళు వస్తే తలుపు తియ్యడంలేదు. మయాకు దిగులూ కంగారూ ఎక్కువయి పోయినాయి.

చివరకు మారుతీరావ్‌నీ పిలిచి “ఇప్పుడు నేనాక విషయం చెప్తన్నాను. మీరు ఏమీ అనకూడదు” అన్నది

పిల్లల భవిష్యత్‌ అంటూ మొదటి నుండీ అన్నిటికీ నోరు మూయించడం ఆమెకు అలవాటే.

అక్క రాగిణిని బెంగళూర్‌ హాస్టల్‌ నుండి పిలిపిస్తే తనతో గడుపుతూ కాస్త కోలుకుంటాడు అనుకుంటుందేమో. వెళ్లి కూతురు రాగిణిని తీసుకు రమ్మంటుందేమో అనుకున్నాడు.

“నేను రాజును సైకాలజిస్ట్‌ దగ్గరకు తీసుకెల్దాము అనుకుంటున్నాను.” అన్నది

మారుతిరావ్‌కి వల్లు మండి పోయింది. “రాజును కాదు ముందు నిన్ను చూపించాలి సైకాలజిస్ట్ దగ్గర...” కచ్చగా అనుకున్నాడు. మరోక్షణం ఆలోచించి “నిజమే రాజు ను తీసుకెళ్తే వాడి మనసులో ఏముందో అన్నీ కనుక్కుని ఏమి చెయ్యాలో చెప్తాడు కదా...” అనుకుని “సరే.” అన్నాడు. “కానీ రాజు ఇప్పుడు ఎక్కడికీ

ప్రజల భాషలో పరిపాలించలేని ప్రభుత్వాలు మనకు సిగ్గుచేటు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ - 2019

29