పుట:Ammanudi-June-2019.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పథకాలతో వేగాన్ని పెంచుకోవాలి. అనేక మార్గాల్లో ప్రయత్నించాలి. అనేక కార్యక్రమాలను సమన్వయపర్చుకోవాలి. అందుకుగాను:

1. పెద్దెత్తున యువతను వాడుకోవడం. :ఃఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌/ టెన్‌ ఒకరు ఒక్కొక్షరికి/ పదిమందికి బోధించాలిః అన్న పథకంతో, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో విద్యార్థులు పదేసి మందికి చదువు చెప్పాలన్న నిర్దేశం ఉండాలి. సబ్జెక్టుగా దీనికి మార్కులు కేటాయించాలి. ఇట్లా మూడేళ్లపాటు విద్యార్థులు చదువు చెపితే 2022 కల్లా లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటాం.

2. విద్యార్థులను ఆకట్టుకోడానికి పిల్లల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు తదితరాల్లో పోటీలు పెట్టవచ్చు. టీచ్‌ ఇండియా/ప్రీత్‌ ఇండియా పోటీలు ఉపయోగపడతాయి.

3. 20-20 క్రికెట్‌ పోటీల్లా 20-20 లిటరసీ పోటీలు పెట్టవచ్చు. 20 మంది బృందంగా నిరక్షరాస్యులున్న ప్రాంతాల్లో 20మందికి చొప్పున చదువు చెపితే అక్కడ ఏడాదికి 400 మంది అక్షరాస్యులవుతారు.

4 సుదూర ప్రాంతాలకు ప్రత్యేక సాక్షరతా రైళ్లు, సాక్షరతా బస్సులు నడిపి చదువు చెప్పడానికి యువతను పంపవచ్చు.

5.కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోనులను పెద్దెత్తున ఉపయోగించుకోవచ్చు. గ్రామాలలో కంప్యూటర్‌ కియోస్సును ఉంచి, ఒక టెళ్నిషియన్ను, బోధకుడిని నియమించాలి. అభ్యాసకులు వారి వీలును బట్టి వెళ్లి స్వయంగా నేర్చుకునే అవకాశాన్ని కల్పించవచ్చు.

6. చదువుకున్న గృహిణికి జీతం లేదా గౌరవభ్బతి కల్పించడం ద్వారా తోటి నిరక్షర మహిళలకు చదువు చెప్పించవచ్చు.

7. టీచర్‌ ట్రైనింగ్‌ విద్యార్జులకు మార్కులతో కూడిన నిర్బంథ ప్రాజెక్టులను అప్పగించి, చదువు చెప్పించవచ్చు.

8. జిల్లా కలెక్టర్లందరికి లక్ష్యాలను నిర్దేశించాలి. అన్ని కార్బోరేట్స్‌ ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు సామాజిక బాధ్యతగా అక్షరాస్యతా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలన్న నిర్భంధం ఉండాలి. జాతీయ నియంత్రణా వ్యవస్థను ఒక నేషనల్‌ లిటరసీ కన్సార్టియం:గా ఏర్పరుచుకోవడం వల్ల కార్యక్రమాల్లో లోటుపాట్లను ఎప్పటికప్పుడు సవరించుకోవచ్చు. కన్నార్దియం అంతర్జాతీయ సంస్థల అనుసంధా నంతో కూడా ఉండవచ్చు.

మనం మూడేళ్లల్లో లక్ష్యాన్ని చేరగలమన్న అశకు మూడు బలమైన అంశాలు ఊపిరి పోస్తున్నాయి. 1.సమాచార సాంకేతిక పరిజ్ఞానపు అందుబాటు పెరిగి దేశంలోని ఏ మూలకైనా విషయాన్ని క్షణాల్లో చేరవేయగలిగిన సాంజేక పరిజ్ఞానం ద్వారా అక్షరాస్యతా కార్యక్రమాలను నిర్వహించగలగడం, 2. 35 %నికి పైగా జనాభా నగరాలకు తరలి పోతారన్న అంచనా, అంటే అక్షరాస్యత విలువను తెలుసుకోగలుగుతారు, 3. సాధించాలన్న తీవ్ర రాజకీయ నిర్ణయం ప్రస్తుతం మనకు అందుబాట్లో ఉన్నాయి కాబట్టి మనం అందరం, అన్నిటా కలిసి నడిస్తే 2022 కల్లా సాక్షరసమాజాన్ని సాధించుకోగలం.

మూలం : ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ అడల్డ్‌ ఎడ్యుకేషన్‌

రచయితలు : ఆర్‌.పి.సింగ్‌, జగదీష్‌ సింగ్‌


(20 వ పుట తరువాయి)

ఇక రాత సాహిత్య సంప్రదాయ విమర్శనా పద్దతులను మాత్రం, అటు ఆంగ్లం, తెలుగు రచయితలు, ఉపాధ్యాయులు ఎడాపెడా ప్రచారం చేయసాగారు. అస్తిత్సవాదం దీనికి ఊతమి చ్చింది. (మానవ స్వభావం ఇదీ అని కొన్ని లక్షణాలను మానవులందరూ ఒక అంగీకారంతో ఉంటారు కాబట్టి, లక్షణాలను మార్చటం ద్వారా మానవ స్వభావాన్ని సమాజాన్ని మార్చటం సాధ్యమే అనేది అస్తిత్వవాదుల భావన. ఇలాంటి మార్పులన్నీ మనీషి తనలోంచి తనే చేసుకోవాలన్నది వారి అభిప్రాయం. 23. సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ. నళిని. 1999)

ఇలా సాంస్కృతిక రంగంలో “ఉపరి తలానికి చెందిన రచయితల కళాకారుల ప్రాబల్యం పెరుగుతుంటే, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ రాష్త్రాల వారిగా జానపద సంస్కృతి మీద ప్రచురణలు తెచ్చింది. సాహిత్య అకాడమి అటువంటి పని ప్రారంభించింది కానీ వాటికి బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణలకున్న సమగ్రత రావటంలేదు. తెగల వారీగా సాహిత్యం పై తెస్తున్న ప్రచురణలు తగినంత పరిచయం చేరిస్తే తప్ప జనానికి అర్ధం కావు. విశాఖలో గిరిజనసంప్రదాయ సాహిత్య సదస్సు, విజయవాడలో గిరిజన రచయితల సదస్సు అకాడమి జరిపించింది.

నేడు పరిశోధక విద్యార్దులు క్షేత్ర కృషి తగ్గించి, రాత సాహిత్యానికే పరిమితమౌతున్నాా గిరిజనులైన పల్లాల బొర్రంరెడ్డి, దాసరి చిన మూగన్న, తోకల గురవయ్య వగైరాలు సంప్రదాయ సాహిత్యం సేకరిస్తున్నారు. రాత సాహిత్వం, నుడికారాలను కొంత వాడుకుంటున్నా ఆ ప్రక్రియలకు ఒక పరిమితి ఉంటుంది. రచనలు విజ్ఞాన సర్వస్వాలు కావు. రచనలలో సమాజాన్ని చూడటం చూరులోంచి వెన్నెలను చూడటం వంటిదే.

అచ్చతెలుగు అభిమానులు, ఇటువంటి సంప్రదాయ సాహిత్యం సేకరణ, పునర్ముద్రణ పర్యావరణం, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పాతపంటల మీద ఆసక్తి పెరుగుతున్నందున, అందుకు సంబంధించిన సామెతలు నుడికారాలను గుర్తు చేయడం, వాటిని శాస్త్ర పరిశోధనలకు, సాహిత్య రచనలకు ముడిసరుకుగా అందించటం, జీవవైవిధ్యం, అడవులు, సముద్రం, బీళ్ళు - ఈ ఉమ్మడి వనరులను వాటిమీద ఆధార పడిన జాతుల తెగల పరం చేయటంలో ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు, సిద్దాంతాలు వల్లిస్తూ, అమలును పక్కదారి పట్టిస్తున్న “ప్రగతిశీల” రాజకీయాలను చర్చించటం, మాండలికంలో వస్తున్న రచనలను - సంప్రదాయ సాహిత్యం నేపధ్యంలో సమీక్షించటం, వాటిలో జారిపోయిన, లోపించిన విషయాలను గుర్తుచేయటం పంపిణి పెంచుకోటానికి ఈ పంటల, రుచుల ప్రచారానికి, ప్రామాణిక భాషలో చేస్తున్న రచనలలో లోపిస్తున్న మూలాలు, తెలుగుతనం ఎత్తిచూపటం ఇలా ఎన్నో విధాల తన్నుకొస్తున్న జనం వారసత్వం తెలియచేయటం మీద దృష్టి పెట్టాలి.

“గేర్లు ఎలాగా మార్చాలో ఎవరైనా ఒకసారి చెప్పేస్తే, హెలికాష్టరు కాదు, దాని అమ్మ బాబు నైనా నడిపేవచ్చునండి' 'అప్పన్న సర్దార్‌ ' లో రచయిత పతంజలి చెప్పిన మాటల్లో మర్మం గ్రహించి భాషాభిమానులు గేరు మార్చాలి.

“జడలు విచ్చిన సుడులు రెచ్చిన కడలి నృత్యం శమిస్తుందా నడుమ తడబడి, సడలి మునుగక - పడవ తీరం క్రమిస్తుందా ... నిజంగానే...నిజంగానే...శ్రీ శ్రీ.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ - 2019

27