పుట:Ammanudi-June-2019.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అడల్డ్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌ఐఏఇ) అ అతీగతీ లేదు.

9. విద్యార్థులు, స్వచ్చంద సంస్థలు చురుకుగా పాల్గొన్న కేరళ విజయ స్ఫూర్తితో 14 రాష్త్రాలకు సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమాన్ని విస్తరించి, 30 లక్షల స్వచ్చంద బోధకులతో, 3 కోట్ల మందికి చదువు చెప్పించారు కాని ఆస్థాయి ఫలితాలు రాలేదు.

10. నూతన అక్షరాస్యులకు వృత్తి నైపుణ్యాలు గడపడానికి ప్రారంభించిన 32000 జనశిక్షణ నిలయాల గతి తెలియరాలేదు. ఆ తరువాత వచ్చిన శ్రామిక విద్యా పీఠాల పేరును జనశిక్షణ సంస్టానాలు (జెఎస్‌ఎస్‌)గా మార్చారు. వీటిలో కొన్ని రద్దుకాగా 250 జె.ఎస్‌.ఎస్‌.లను 2018 మార్చి తరువాత నైపుణ్యాల అఖివృద్ధి మంత్రిత్వశాఖకు బదిలీ చేశారు.

11. సాక్షర్‌ భారత్‌ కార్యక్రమంలో 70 మిలియన్ల నిరక్షరాస్యులను (60 మిలియన్ల మహిళలు) అక్షరాస్యులను చేయాలన్నది లక్ష్యం కాగా, ఆయా జనాభా ప్రాతిపదికన 14 మిలియన్లు ఎస్‌సిలు, 8 మిలియన్లు ఎస్టీలు, 12 మిలియన్లు బిసిలు, 36 మిలియన్లు ఇతరులు ఉండాలని నిర్దేశించుకున్నారు. అయితే ఇది ఆయా వర్గాలలో ఉన్న వాస్తవ నిరక్షరాస్యుల సంఖ్య ఆధారంగా చేసుకున్న లక్ష్యం కాదు. 410 జిల్లాలలోని కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కార్యక్రమాన్ని అమలు చేయడం వల్ల పట్టణాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న మురికివాడలు, వెనుకబడిన ప్రాంతాలను వదిలేయడం జరిగింది. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో పట్టణ ప్రాంత మురికి వాడల్లో మొత్తం 50 మిలియన్ల నిరక్షరాస్యులు ఉన్నారు. పైగా 11 ప్రణాళికాంతం, 2012 మార్చినాటికి 70 మిలియన్ల మందిని అక్షరాస్యులను చేయాలన్న లక్ష్యం .12 వ పంచవర్ష ప్రణాళికలో కూడా కొనసాగింది. ఎన్‌ఐఓఎస్‌ పరీక్షల లెక్కల ప్రకారం 2010 ఆగస్టు నుండి 2018 మార్చ వరకు మొత్తం 16 విడతల్లో పరీక్ష రాసిన 101 మిలియన్ల మందిలో 76.1 మిలియన్లు ఉత్తీరులయ్యారు. ఆ రకంగా ఆరేళ్లు ఆలస్యంగానైనా సాక్షరభారత్‌ లక్ష్యం 70 మిలియన్లను సాధించినట్లే. కానీ ఈ లెక్క వాస్తవాతీతంగా అనిపిస్తున్నది.

13. 2011 జనాభా లెక్కల్లో తేలిన 285 మిలియన్ల నిరక్షరాస్యుల్లో, పట్టణాల్లోని 1.08 లక్షల మురికివాడల్లో 47.85 మిలియన్లు ఉన్నారు. సాక్షరభారత్లో పట్టించుకోని వీరిని ఇండియా యట్‌ 75 లేదా రోటరీ ఇండియా లిటరసీ మిషన్ల ద్వారా పబ్లిక్‌ ప్రయివేట్‌ పార్టనర్‌ షిప్‌ కింద అక్షరాస్యులను చేసే ప్రయత్నం, ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. వీటన్నటిని చక్కదిద్దడానికి 2018 మార్చి తరువాత కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగింది. సాక్షరభారత్‌ కార్యక్రమాన్ని దిద్దుబాటుతో పునరుద్ధరించడానికి సమయం పడుతుంది. ప్రస్తుత పరిస్థితిలో మౌలానా ఆజాద్‌ తాలీం ఎ-బాలిఘన్‌, ఎలక్టోరల్‌ లిటరసి, ఫైనాన్సియల్‌ లిటరసీ, డిజిటల్‌ లిటరసీ, లీగల్‌ లిటరసీ, ఈక్వవలెన్సీ వంటి సృజనాత్మక కార్యక్రమాలను అమలు చేయడం కష్టం.

71 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో విద్యకు సంబంధించి రెండు నేషనల్‌ పాలసీలను, 12 పంచ వర్ష ప్రణాళికలను, ౩ వ వార్షిక ప్రణాళికలను (పంచవర్ష ప్రణాళికలకు సెలవు ప్రకటించినప్పటి) వచ్చాయి. 14 ఆర్థిక కమీషన్లను, 2 ఎద్యుకేషన్‌ కమిషన్లను , కేంద్ర సలహా సంఘం వారి విద్యపై 65 సమావేశాలను (1947 తరువాత 53 సమావేశాలు), వయోజన విద్యకు సంబంధిందచిన 5 ప్రధాన ప్రణాళికలు / కార్యక్రమాలు అమలయ్యాయి. ఇప్పటికీ దేశంలో 7 సంవత్సరాలకు పైబడిన నిరక్షరాస్యులు 250 మిలియన్లు ఉన్నారు. కాబట్టి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. కేంద్ర స్థాయినుంచి రాష్ట్రాలు, జిల్లా, మండలం, గ్రామ మరియు నగర స్థాయివరకు ఒక శాస్వత వ్యవస్థ ఏర్పడాలి. అందులో నిరక్షరాస్యులే కాదు, నూతన అక్షరాస్యులకు నేర్చిన నైపుణ్యాలను మరిచి, తిరిగి నిరక్షరాస్యులుగా మారకుండా, నిరంతరం విద్య మరియు జీవన పర్యంత విద్యా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది.

కొన్ని ప్రత్యేక లక్ష్యాలేర్చరుచుకుని ఆ తరువాత ఆయా కార్యక్రమాలను సరైనవిధంగా విశ్లేషించకుండానే నిలిపివేయడం వల్ల ఖర్చుచేసినట్టి మౌలిక, మానవ వనరులు వృథా అవుతాయి. ఆయా కార్యక్రమాల ఫలాలు ప్రజలకందవు. తీవ్ర సామాజిక ఆర్థిక నష్టాన్ని భరించాల్సి వస్తున్నది. ఇప్పుడు కూడా అట్లా జరక్కుండా కొత్త కార్యక్రమాన్ని జాగ్రత్తగా రూపొందించుకోవాల్సి ఉంది.

2022 కు అనేక ప్రత్యేకతలు...వాయువేగాన సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి

2022 కల్లా దేశ జనాభా పట్టికలో వయసు, అర్హతలను బట్టి ఉద్యోగార్జులు అత్యధికంగా ఉంటారని అంచనా. పెద్ద సంఖ్య లోని ఉద్యోగార్జుల ఉత్పాదక శక్తిని అభివృద్ధి మార్గంలోకి తేలేకపోతే, దేశం తీవ్రవిపత్మర పరిస్థితిలోకి పడిపోయే ప్రమాదముంది. ఆ శక్తినీ సరైనరీతిన ఉపయోగించుకుంటే మంచి ఫలితాలను పొందుతాం. 75వ స్వాతంత్ర్య దినోత్సం కూడా 2022లోనే రానుంది. అప్పటికి సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తే, అక్షరసమాజాన్ని కోరుకున్న జాతిపిత మహాత్నాగాంధీకు, గొప్ప నివాళి అవుతుంది.

2014 ఎన్‌ఎస్‌ఎస్‌ వారి 71వ విడత లెక్కల ప్రకారం మనం 75.4% అక్షరాస్యతను సాధించాం. ఇప్పటికది ఏడాదికి ఒక శాతం చొప్పున పెరిగి 78.0% నికి చేరి ఉంటుంది. అంటే మనం రాబోయే మూడున్నర యేళ్ళల్లో (2022 ఆగస్టు నాటికి) సుమారు 22% మందిని అక్షరాస్యులను చేయాలి. అనారోగ్యం మొదలైన కారణాలుగా కొందరిని వదిలేయాలి కాబట్టి సంపూర్ణ అక్షరాస్యతంటే 100% అక్షరాస్యత అని కాదు. వదిలేయాల్సిన వారిని 2%గా పరిగణిస్తే, మన జనాభాలో ఏడేండ్లు దాటిన సుమారు 20% మందిని అక్షరాస్యులను చేయాలి. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఏడాదికి 1% చొప్పున అక్షరాస్యతలో అభివృద్ది కనిపిస్తోంది. ఆ ప్రకారం సంపూర్ణ అక్షరాస్యత సాధనకు మనకు 20 ఏళ్లు పట్టవచ్చు. కానీ అత్యంత ఫలవంతమైన

గుండె లోతుల్లోంచి వచ్చేదీ, మనసు విప్పి చెప్పగలిగేదీ'అమ్మనుడి 'లోనే

26

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ - 2019