పుట:Ammanudi-June-2019.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుడు, యానాదికి తిండి కరువే లేకుండెను. అతని సంసార బలగము బరువే కాకుండెను.

అప్పటికీ అతడు తిన్నది నాగజెముడు పండ్లు, నివసించినది కాలువ కట్టన. తాగినది దొరువు నీరు, కట్టినది పారవేసిన పరాయి కట్టుగుడ్డ, అట్టి నిరపరాధికి, నిష్కామకర్శికి, ఒకేసారి ఇద్దరు పెండ్లాలు ఉండకూడదని, బొట్టుకట్టని స్త్రీ తోడి కలయిక వ్యభిచారమని ఏ పనిచేయక, స్థిరనివాసము ఏర్పరచు కొనక, తిరుగుబోతుగా నుండుట, ఎవరికీ అపాయము కానప్పటికీ శిక్షార్హమని, దిసమొలతో తిరుగుట నేరమని, గ్రామాన్ని వదిలి మరో గ్రామానికి పోవటం పెద్దనేరమని మొదలగు అనేకనేరాలను అతని నొసటిపైన మనం రాస్తే అది ఎవరి తప్పు? (యానాది పేజి 118.ఆంధ్ర రాష్ట్ర ఆదిమ సేవా సంఘ ప్రచురణ 1974).

కోర్టులో గిరిజనులు పడే తబ్బిబ్బులను గిడుగువారు పేర్మొంటే న్యాయవాదియైన రాఘవయ్యగారు కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తారు.

ఇంత స్పష్టమైన అవగాహనతో, సమకాలికులు పనిచేసిన ఉదాహరణలుండగా, హక్కుల ఉద్యమాలు కప్పగంతులు వేస్తున్న జాడలను బాలగోపాల్‌ ఇలా కనుగొంటారు. 'కమ్యూనిస్ట్‌ ఉద్యమం నుండి వచ్చిన అనేక అభిప్రాయాలు ఫౌర హక్కుల ఉద్యమంలో భాగం అయిపోయాయి. అవి ఈ ఉద్యమానికి అవసరమా? ప్రయోజనకరమా? అసలవి సత్యమేనా అని చర్చించకుండా, వాటిని పౌర హక్కుల అవగాహనలో భాగం చేసుకోవటం వల్ల ఈ ఉద్యమం విశాల స్వభావాన్ని సంతరించుకోలేక పోతున్నది. తనదైన అవగాహనను రూపొందించుకోలేక పోతున్నది”. (46).

“తిండి ఉంటె చాలు వాక్‌ స్వాతంత్రం అక్కరలేదని, వాక్‌ స్వాత్రంత్రం ఉంటె చాలు తిండి అక్కరలేదని, హక్కులలో హెచ్చు తగ్గులు నిర్ధారించటానికి జరుగుతున్న చర్చను పౌర హక్కుల ఉద్యమం తిరస్మరించాలి. మనీషి నిండుగా ఎదగటానికి అన్ని హక్కులు అవసరం అని గుర్తించాలి” (78. హక్కుల ఉద్యమం. బాలగోపాల్‌).

హక్కుల ఉద్యమ అధివక్త భాషావేత్త చామ్మీ ఇదే విషయాన్ని కాస్త కటువుగా చెప్పాడు. “పారిశ్రామిక ప్రజాస్వామ్యం ఎంత ముఖ్యమో కార్మికులందరికీ అనుభవ పూర్వకంగా తెలుసు. కార్మికులందరూ మార్క్స్ ను చదివే ఈ విషయం తెలుసుకోలేదు. మార్క్స్ పూర్వం నుంచే ఈ భావనుంది. (20 చామ్స్మీ 'ఆలోచనే ఆయుధంగా ' ప్రజాశక్తి బుక్‌ హౌస్‌).

శ్రామిక సంస్కృతిపై స్పష్టమైన అవగాహనగల తిమరా, 'జానపద సాహిత్యంలో వర్గ స్పృహ ఉంది, వర్గ చైతన్యం లేదు”. (109) అనే నిర్ణయానికొస్తారు. కానీ వర్గ్ణచైతన్యం అనాదినుండి జాతి మనసు లో లోతుగా నాటుకున్న వైనం మన స్థల పురాణాలు గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఇటువంటి (ఆర్మిటైప్స్‌) ప్రాగ్రూపాలను మార్క్స్ కూడా వాడారు.శ్రీశ్రీ సరేసరి. జాతి సంస్కృతిని నడిపించే నిర్మాణాలను ఆవిష్కరిస్తూ మానవ, భాషాశాస్రజ్జులు జానపద గిరిజన సాహిత్య విమర్శను (లిటరరీ ఆంత్రపాలజి) తీర్చిదిద్దితే, అస్తిత్వవాదులు లిఖిత సాహిత్య విమర్శను పెంపొందించారు. (నిర్మాణ వాదం మొదట్లో భాషకు సంబంధించినదే. భాష అన్నపుడు మాట్లాడే భాష రాసే భాష మాత్రమే కాదు, అన్నిరకాల వ్యక్తీకరణ రూపాలుకూడా. (95 సాహిత్య విమర్శపదాల డిక్షనరీ. నళిని)

మార్కిస్ట్‌ దృక్పధంతో జానపదుల, గిరిజనుల పోరాటాలను సమీక్షించిన చరిత్ర కారులు రంప, గూడెం పితూరిలలో సాంస్కృతిక వారసత్వం నిర్వహించిన పాత్రను గుర్తుచేస్తారు.

“In Gudem Rampa case, religion was used to express dissatisfaction with subjugation and frame the terms of delierance with in a known model that proided symbolic capital to counteract the superior control of economical capital by their oppressors...This was rendered authentic by the encounter of Bodadu with fie Pandaas in the jungle, a symbolic mediation of local and national culture that was politically expedient for integration of hill men with the supporters in the plains Ñ.

(Readings in Subaltem Studies Ed.Daid Ludden 2002. Orient black Swan.)

సాంస్కృతిక వారసత్వంలో, స్థల పురాణాలు, జాతరలు, కొలుపులు, పురా గేయగాధలు ప్రధాన పాత్ర వహిస్తాయి.

నాగరాజులకు మత్స్వరాజులకుగల సహజ వైరాన్ని విశాఖ మన్యంలో మత్స్యగుండం పురాగాధ వివరిస్తుంది.

వస్తుమార్పిడి, సమష్టినిర్ణయంతో నడిచే వ్యవస్థ /విధానం గిరిజనులది. బంగారం, నాణేలు వంటి కృత్రిమ విలువలను వారు మాయగా భావించి విధ్వంసానికి దిగటాన్ని తెలియచేసే ముఖలింగం లో మధుకేశ్వరస్వామి, కారా మాస్టారి యజ్ఞం కథను తలపిస్తుంది.

కానీ వివిధ రూపాలలో నాగరికత దాడి చేస్తుందని, దాన్ని ఎదుర్కోవటానికి కావలసిన నైపుణ్యం, చదువు నేర్చుకోవాలని పూరి క్షేతం అక్షర బ్రహ్మకథ బోధిస్తుంది. చదువుతో పాటు, ఇందుకు కావసిన బలగాన్ని కులాలను కలుపుకుంటూ సమకూర్చుకోవాలని మోదకొండమ్మ కథ, నాగరాజుల మత్స్వరాజుల కథలాగే,” పంచ పాండవుల పంట దుర్యోధనుడి వంట, కొండవారిపంట - దిగువ వారి వంటకు పోతున్నప్పుడు జరుగుతున్న దోపిడీని గిరిజన భారతాన్ని వర్ణించే నందిపండుగ పాట వివరించి, తంతుద్వారా మాజిక్‌ రియలిజం శిల్పంతో సుఖాంతం చేస్తుంది.

అయితే చదువు నేర్చుకోవాలనే అక్షర బ్రహ్మకద ఒక తంతుగా మారితే, ప్రభుత్వం 'సంతోష చంద్రశాల ' 'ఆటబడి - పాటబడి” “చదువు కొత్తలు” వంటి ముద్దుపేర్గుపెట్టి, సార్వత్రిక విద్యపేరిట గిరిజనుల ఆటపాటలను పక్మన పెట్టి, “పల్లపు” చదువులను గిరిజనుల మీద రుద్దసాగారు. వీరి రచనలలో హైకూలు దొర్లుతాయి కాని గిరిజనుల సాంస్కృతిక వాసనలేమీ కనిపించవు.

విశ్వవిద్యాలయాలలో జానపద విజ్ఞానం జోధించేవారు కూడా మానవ, భాషాశాస్త్రాలు వృద్దిచేసిన విమర్శనా సంప్రదాయం, (అంబేద్కర్‌ సార్వత్రిక విద్యాలయం ఒక అధ్యాయంగా చేర్చినా) ప్రచారానికి నోచుకోలేదు. మానవశాస్త్ర వేత్తలకు సాహిత్యం అక్కరలేదు.

(తరువాయి 27 వ పుటలో)

20

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019