పుట:Ammanudi-June-2019.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాష-ప్రగతి

డా॥పి. శివరామకృష్ణ (శక్తి) 94414 27977

సాహిత్యం, సమాజం, సాధికారిత 'గేర్లు మార్చాలి'

ఉద్యోగులకు ప్రజలకు కావలసిన చదువు చెప్పే స్వతంత్రం లేదు. బానిస చదువులు చదివిన వాళ్ళకు ప్రజల చదువుమీద ఆసక్తి లేదు. బూర్జువా చదువులు చెపుతూ విప్లవాల గూర్చి కొందరు గర్జిస్తుంటే, సాహిత్యసభలలో కొందరు పరవశిస్తున్నారు. ఇటువంటి మాయ జలతారు సోకులతో మురిపిస్తున్న ఉత్సవ విగ్రహాలనుండి బతుకుతెరువులకు మూలాధారాలైన మూలవిరాట్టులు జానపద వాంగ్మయం, కళలను నిలబెట్టుకోవాలి. పారిశ్రామికవిప్లవం తరువాత ఉత్పత్తిసాధనాలన్నీ పెట్టుబడి దారుల వశమౌతున్న తరుణంలో, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలుపునిస్తే నేడు సుస్థిర అభివృద్ధి కోసం, వికేంద్రీకరణ ద్వారా ఉత్పత్తి సాధనాలను సొంతం చేసుకోడానికి ఉద్యమించాలి.

మార్క్సిస్ట్ విమర్శకుడు త్రిపురనేని మథుసూదనరావు(తిమరా), తెల్లవాళ్ళు రాకముందు గల తెలుగు సాహిత్యం, సంస్కృతిని గూర్చి వివరిస్తూ 'మొత్తం సాహిత్యం మీద మౌఖిక సాహిత్య ప్రభావం బలంగానే ఉంది” అని నొక్కి చెపుతూ, నాటి శృంగారచర్చలు స్త్రీ విముక్తి ఉద్యమంగా పరిణమించేవి అంటారు. తెల్లవాళ్ళ విద్య, ఉద్యోగాలు మనలను ఎలా బానిసలను చేసాయో, లిఖిత (రాత) సాహిత్యం ఎలా ప్రజలకు దూరం కాసాగిందో వివరిస్తారు.కవితా విష్లవాలలో జానపద వాంగ్మయం చేర్చకపోవటాన్నిదుయ్యబడతారు. కొడవటిగంటి ఈ పరిణామాలకు నిరుత్సాహ పడతాడు. కానీ యానాది రాఘవయ్యగారు ఈ పరిణామాలగూర్చి విస్తృతంగా రాయ టమేకాక, గిరిజనుల విముక్తికి తనజీవితాన్ని అంకితం చేసారు.

“జానపద వాంగృయంలో తెలుగు ప్రీల సాహస పరాక్రమాలే కాక ప్రణయ జీవితంలో కూడా స్వేచ్చా, మానవతా స్పూర్తి కనిపిస్తాయి (107) పదకవిత్వం పాలక వర్జాల కవిత్వం కాగా, సంస్కృతీ కరణ దాస్యం లేదు కాబట్టి జానపద కవిత్వం సూటిగా వచ్చింది... మొత్తం సాహిత్యం మీద మౌఖిక సాహిత్య ప్రభావం బలంగానే ఉంది”

(నాయకరాజుల కాలంలో) 'కుల సంబంధాలలో దూరం తగ్గిపోయింది. స్త్రీ పురుష సంబంధాలలో కొంత స్వేచ్చా, శృంగార సమస్యల బహిరంగ చర్చ కనిపిస్తుంది” (186) “మధ్యలో వలస వాదులు వచ్చి మొత్తం సామాజిక వ్యవస్థను కంపింప చేయకపోతే స్వేచ్చాభోగ ఉద్యమం స్త్రీ విముక్తి ఉద్యమంగా పరిణమించేది”. (182) అంతేకాదు 'లేఖనప్రక్రియను మాత్రమే కవితా విప్లవాలకు చోదక శక్తిగా చెప్పటం అర్ధరహితం. లేఖనప్రక్రియ కవిత్వం కోసం పుట్టదు. శారీరక మానసిక శ్రమవిభజన నుంచి ఏర్పడుతుంది" (74) లిఖిత, జానపద సాహిత్యాల పొత్రను,హద్దులను, ప్రత్యేకతలను స్పష్టం చేస్తారు.

“ప్రజాసామ్యం పేరుతో బూర్జువా నియంతృత్వాన్ని అభ్యుదయ వాదం సమర్దించింది. మధ్యే మార్గంగా సంస్మరణ వాదాన్ని చేపట్టటంతో అవకాశ ధోరణులు ప్రబలం అయ్యాయి. The bourgeoisie has stripped off its halo hither to honored and looked up to reerent awe. It has conerted physician the priest, the poet, the man of science into its paid wage laborer N.(Marx- Engels' Manifesto) సాహిత్యం అమ్మకపు సరుకుగా మారిపోయింది. కళవ్యాపార కళగా మారిపోయింది. వెన్నెముక లేని మధ్యతరగతి జీవితం సాహిత్యంలోకి ప్రవేశించిది. 117. వాళ్ళు (నవలా రచయితలు) వ్యావహారిక భాష దగ్గరికి తీసుకరావటంకాక, వ్యావహారిక భాషనే సాహిత్య భాషగా మార్చారు. తెలుగు ఇంగ్లీష్‌ పదాల కలయిక, వాక్య నిర్మాణం లో ఇంగ్లీష్‌ వాక్యనిర్మాణ పద్దతులను ప్రవేశ పెట్టి వ్యావహారిక భాషను ప్రజలకు దూరం చేసారు... (118, సాహిత్యంలో వస్తుశిల్పాలు. త్రిపురనేని మధుసూదనరావు. 1997)

కొడవటిగంటి కుటుంబరావు కూడా ఇటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ నిరుత్సాహపడతాడు (పల్లెటూళ్ళలో జనం నిత్యజీవితంలో వాడే ప్రయోగాలూ పదజాలము తెలియని పేరుపడ్డ రచయితలు చాలామందిమి ఉన్నాం. మధ్య తరగతి మిధ్యా ప్రామాణిక భాష వొకటి ఆధిపత్య భాషగా స్థిరపడటం మొదలైంది. ఈ కాలపు అభ్యుదయ సాహిత్య కారులు రాజకీయ సామాజిక ఆర్ధిక రంగాల మీద దృష్టి పెట్టినంతగా భాషమీద దానిగతి తార్మికత మీద దృష్టి పెట్టలేదు. 61.

విప్లవాల సంగతి అటుంచి చిన్న చిన్న సంస్కరణలను కూడా సాహిత్యం చెయ్యలేదు. జీవితం దిగబెరుకుతున్నప్పుడు, సాహిత్యం ఎగబెరకదు. 96.ప్రజాసాహితి కొ.కు శతజయంతి ప్రత్యెక సంచిక. 2009

యానాది రాఘవయ్య గారు బ్రిటిష్‌ దమన, దండ నీతి బలహీన వర్గాలను ఎలా బలితీసుకున్నాయో 'యానాది 'లో చిత్రిస్తారు. ఇది ఎవరి తప్పు అని నిలదీస్తారు. (బ్రిటిషు ప్రభుత్వం మన అనాది నీతులను మంటగలిపి కొత్త నేరాల జాబితా మనకు అంటగట్టి నప్పటినుండి, ప్రతిదీ నీదా, నాదా అనే గీటురాతికి లోబడవలసి వచ్చింది. ఎవరూ కష్టించి పండించని చెరువు చేపలు, కప్పుతుంగలు, అడవి కట్టెలు, సవకచెట్ల తోపులు, పోరంబోకుల ఫలితాలు, ఈ పంచాయతీరాజులు రాకమునుపు పేద సాదా అనుభవించు చుండిన

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019

19