పుట:Ammanudi-June-2019.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


2. హకారం పోకుండా చాలా సందర్భాలలో నిలబడుతూ ఉంది.

3. పదాది వకారం నిలబడి స్పష్టంగా పలికే సందర్భాలు ఎక్కువగా ఉంటున్నాయి.

4. సంయుక్త హల్లుల స్థానంలో ద్విత్వాక్షరాలు పలకడం కొంత తగ్గింది సంయుక్తాక్షరాలను పలకడం పెరిగింది.

5. శ ష స ల ఖేదం విషయంలో పెద్ద మార్పు రాలేదు. చివరికి నగరంలోని వ్యవహారంలో కాని టీవీ యాంకరమ్మల భాషలో కాని ఎక్కడ శ పలకాలి, ఎక్కడ ష పలకాలి, ఎక్కడ స పలకాలి అనే విచక్షణ ఇంకా పెరగలేదు.

టీవీ యాంకరమ్మల కృతక భాష చాలా సందర్భాలలో జానపద భాషలో అనుకరణకి లోనవుతూ ఉంది.

6. మూర్ణన్వాక్షరాలు స్పష్టంగా పలికే విధానం పెరిగింది కాని ఇంకా వాల్లు, వీల్లు, పల్లెం, వాన్ని అని పలికే తీరు ఇంకా ఉంది.

ఆచార్య కృష్ణమూర్తిగారు జానపద భాషకు సూచించిన ప్రమాణాలు పూర్తిగా నశించి శిష్టవ్యవహార రూపాలు జానపద భాషలోనికి రావడం ఇంకా పూర్తిగా జరగలేదు. కాని ఆయన సూచించిన నాటి రూపాలు కూడా పూర్తిగా నిలవలేదు. చాలా మార్చులువచ్చాయి.

జానపద భాషలో వచ్చిన ప్రధానమైన పరిణామం పదాల ఉచ్చారణలో శిష్టరూపం రావడం అన్నది అంత ఎక్కువగా జరగలేదు. విద్యావ్యాప్తి ఎక్కువగా ఉన్నా ఉచ్చారణ పాత ఉచ్చాచరణలు ఇంకా గణనీయంగా నిలిచే ఉన్నాయి. కాని వచ్చిన పెద్దమార్పు ఏమంటే సంప్రదాయ దేశీయ పద సంపద బాగా తగ్గి వాటి స్థానంలో ఇంగ్లీషు పదాలు చాలా విరివిగా వచ్చి చేరాయి. జీవన విధానంలో చాలా కోణాలలో ఈ ఇంగ్లీషు పదాల వినియోగం బాగా పెరిగింది. అంతే కాదు టీవీ అనేది దేశ వ్యాప్తంగా ఒకే విధమైన పదసంపద పెరిగేలా చేస్తూ ఉంది. ఉత్తర భారతంలో వాడే చాలా హిందీ పదాలు ఆహారం భాషలో వచ్చిన మార్పుల కారణంగా ఇక్కడ దక్షిణాది భాషలలో కూడా వచ్చి చేరింది.

తెలుగు జానపద భాషలో వచ్చిన పరిణామాన్ని సరిగ్గా విస్తృతంగా అంచనా వేయడానికి అధ్యయనం చేయడానికి పెద్ద ప్రయత్నమే జరగాలి. ర్యాష్టవ్యాప్తంగా ఒక ప్రాజెక్టు పెట్టాలి. కోర్‌ ప్రాంతంలో పెరిఫెరీ ప్రాంతంలో ఎంపిక చేసే విధంగా కొన్ని గ్రామాల్ని శాస్రీయంగా ఎంపిక చేసుకొని అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి వివిధ సందర్భాలలో వ్యక్తమయ్యే పద సంపదని సేకరిస్తే తెలుగుపదాలు ఎన్ని వందలు వ్యవహార లుప్తం అయ్యాయి.

ఎన్ని ఇంగ్లీషు వదాలు, హిందీ వదాలు జానవద వ్యవహారంలోనికి ఇటీవలి కాలంలో వచ్చి చేరాయి అనే విషయం క్షుణ్ణంగా తెలుస్తుంది. ఈ అధ్యయనం వీలైనంత త్వరగా జరిగితే చాలా మంచిది. ఈ పరిశోధన సమగ్ర నిఘంటు నిర్మాణానికి కూడా బాగా వినియోగపడుతుంది.

18

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019