పుట:Ammanudi-June-2019.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇవి నిరంతరాయంగా కార్యక్రమాలను అందిస్తున్నాయి. రోజులో పగలు, రాత్రి సమయాలలో ఎక్కువ సమయం వచ్చేవి సీరియళ్ళు, తర్వాత సినిమాలు, తర్వాత వార్తలు. ఇక ప్రత్యేకంగా రోజంతా వార్తలు వినిపించే ఛానళ్ళు వచ్చాయి. ఈ మాధ్యమాలలో వినియోగించే భాష ప్రభావం ప్రజల మీద చాలా ఎక్కువగా ఉంది. పత్రికల భాషకన్నా ఈ ఛానళ్ళలో ప్రజలకు వినిపించే భాష ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక సినిమా అనేది ఒకప్పటి తెరమాధ్యమం కాదు. తెరమాధ్యమంగా సినిమా ఉన్నప్పుడు గ్రామీణ ప్రజలు తమకు కనీసం పది కి.మీ దూరంలో ఉన్న కొద్దిపాటి బస్తీకి పోయి సినిమా చూడవలసి వచ్చేది. కాని నేడు సినిమా అనేది తెర మాధ్యమం కాదు గృహప్రక్రియ అంటే domestic genre అని కొత్త నిర్వచనం ఇవ్వాలి. ఒక్కో ఛానల్‌ రోజుకు కనీసం మూడు సినిమాలు అందిస్తూ ఉంది. అంతే కాదు అచ్చం రోజంతా సినిమాలే ప్రదర్శించే ఛానళ్ళు వచ్చాయి. దీని కారణంగానే గ్రామీణ జీవితంలో కానీ నగరంలో కాని సినిమా అనేది గృహప్రక్రియ అయింది ఇంటితెర అయింది అని చెప్పవచ్చు. దీనివల్ల ఇంటి సినిమా ప్రభావం గ్రామీణ జీవితంలో వేష భాషలలో సమూలమైన మార్పు తీసుకు వచ్చింది. టివిలో వాడే భాషని మాట్లాడడం నాగరికత అని పాతకాలంలో మాట్లాడిన భాష మాట్లాడడం మోటు అనే భావన ప్రజలలో వచ్చింది. ఏది జానపవ భాష అని లెక్కిస్తే ఇది జానపద భాష ఇది నగరభాష అని విడమరచి చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

'సెటిలైట్‌ ఛానళ్ళు ఇంటింటికీ వ్యాపించినందువల్ల ఏర్పడిన పరిస్థితి జానపద కళలపైన మరణ శాసనం రాసింది. గ్రామీణుల కున్న తీరిక సమయం మొత్తాన్ని ఈ డిష్‌ టివి లాగేసుకుంది. దీని కారణంగానే జానపద క్రీడలు జునపద ప్రదర్శన కళలు తెరమరుగు అయ్యాయి. అంటే వాటిని అంటిపెట్టుకొని ప్రవర్తించిన జానపద భాష కూడా మరుగై పోయింది అనే అర్ధం. నేటి క్షేత్ర పరిశోధనలో ఎక్కడ ఏ పల్లెలో పలకరించినా ప్రజలు మాట్లాడే భాష టివి భాషకు చాలా దగ్గరగా ఉంటూ ఉంది. ఏ ఛానల్‌ కి సంబంధించిన యాంకర్‌ కాని పల్లెకు ఫోయి ఏ వ్యక్తికైనా మైక్‌ ఇచ్చి అక్కడి సమస్యలను గురించి విచారిస్తే అక్కడి వారు అతనితో మాట్లాడే భాష టివి ప్రసారంచేసే భాష మాదిరిగానే ఉంటుంది. రైతుల సమస్యల గురించి కాని జీవనోపాధి పథకాల గురించి కాని లేదా గ్రామాలలో అమలయ్యే ప్రభుత్వ కార్యక్రమాల గురించి కాని టివి విలేకర్లు అడిగిన ప్రశ్నలకు అక్కడి వారు చెప్పే సమాధానాలు టీివిలలో వింటే అది టివి మాధ్యమాలలో ప్రసారం అయ్యే భాషలాగే ఉంటుంది. కాని అంతకుముందు గ్రామాలలో కనిపించిన భాష కనిపించడం లేదు. క్షేత్ర పరిశోధనలలో అక్కడి వారిని కదిలిస్తే వినిపించే భాష కూడా ఇలాగే ఉంటూ ఉంది.

ఇక గ్రామీణ జీవితాన్నీ సమూలంగా మార్చి మానవ సంబంధాలను అతి దగ్గరచేర్చి వారి భాషలో అత్యధికంగా ఇంగ్లీషు మాటల్ని చేర్చిన మరొక సమాచారవ్యవస్థ మొబైల్‌ ఫోన్‌. నగరంలో ప్రతి ఇంట్లోనే కాదు ప్రతివ్యక్తి దగ్గర సెల్‌ఫోన్‌ ఉంటూ ఉందన్న సంగతి చెప్పనవసరం లేదు. సెల్‌ఫోన్‌ వ్యాప్తి మండలస్థాయిలో ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి తండా స్థాయికి కూడా విస్తరించి ఉంది. మొబైలో ఫోన్‌ ప్రతి ఇంట్లో ఉంది. ఈ ఇంట్లో లేదు అని చెప్పే పరిస్టితి కనిపించడం లేదు. వివిధ వృత్తులు చేసుకునే వారి దగ్గర, ఫొలంలో నాగలి దున్నే వ్యక్తి నడుముకుకట్టి కూడా మొబైల్‌ కనిపిస్తూ ఉంది. చివరికి ప్రతి యాచకుని వద్ద కూడా మొబైల్‌ ఫోన్‌ కనిపిస్తూ ఉంది. తెలుగు వ్యవహార భాషలోనికి చాలా ఎక్కువ ఇంగ్లీషు పదాలు తెచ్చిన ఘనత ఈ ఫోన్‌ వ్యవస్థకి ఉందని తెలుస్తూ ఉంది. ఇంతకు ముందు అంటే కనీసం పది సంవత్సరాల క్రితం గ్రామాలలో క్షేతపరిశోధనలలో ఎవరినైనా ఇంగ్లీషు రాని వారితో మాట్లాడి ఇంగ్లీషు పదాలు లేని తెలుగును విందాము అని అనుకుంటే అది సాధ్యం అయ్యేది. ఇంగ్లీషు చదువుకోని వారి తెలుగు ఎలా ఉంటుందో తెలుసుకోవదానికి అంటే ఇంగ్లీషు పదాలు (బస్సు రైలు వంటివి కాక) లేని తెలుగును వినడం సాధ్యం అయ్యేది. కాని జానపద భాషలో ఇలా ఇంగ్లీషు పదాలు లేని తెలుగు వినడం నేడు సాధ్యం కాదు. పెద్దవారు అంటే 70 లేక 80 ఏండ్లు వయస్సున్న ఆడ మగ వారిని కదిలించినా వారి భాషలో ఆంగ్లపదాలు బాగా వినిపిస్తున్నాయి. సెల్‌ ఫోన్‌ వ్యవస్థ చుట్టూ తిరిగే ఎన్నో మాటలు తెలుగులో లేనివి ఇంగ్లీషు పదాలే అందరి నోళ్ళలో నానుతున్నాయి. సెల్స్‌ సిమ్‌, సిమ్‌ కార్డు, బాటరీ, చార్జింగ్‌, రీచార్జింగ్‌, టవర్‌, కాల్స్‌ కాల్‌ కలవలేదు, కాల్‌ చేసాడు. చార్జింగ్‌ ఎక్కింది. చార్జింగ్‌ దిగిపోయింది. సెల్లులో డబ్బులెయ్యి. ఇలా ఎన్నో వ్యక్తీకరణలు ప్రతి వారి భాషలోనికి వచ్చాయి. ఇక మొబైల్‌ సేవలు అందించే కంపెనీల పేర్లన్నీ కూడా గ్రామాలలో వినిపిస్తాయి. వాటి అధినేతల పేర్లు కూడా వినిపిస్తాయి. బాగా చదువుకున్న వారు విశ్వవిద్యాలయం పండితులు మొబైల్‌ ఫోన్‌ ను చరవాణి, అని కరవాణి అని, ల్యాండ్‌ ఫోన్‌ ని స్థిరవాణి అని అనువాదాలు చేసి సరదాగా వినియోగించు కుంటున్నారు. కాని జానపదుల భాషలో సెల్‌ ఫోన్‌ సెల్‌ ఫోన్‌ గానే వ్యవహారంలో స్థిరపడింది. సెల్‌ ఫోన్‌ వ్యవస్థకి సంబంధించిన ఏ పదాన్ని కానీ వారు తెలుగులో అనువాదం చేసే ప్రయత్నం చేయడం లేదు పూర్తిగా ఇంగ్లీషు పదాలే అక్కడ ప్రచారంలోనికి వచ్చాయి. విస్తరించిన సినిమా, విస్తరించిన డిష్‌ టివి కేబుల్‌ టివి, విస్తరించిన మొబైల్‌ ఫోను, విస్తరించిన ఇంగ్లీషు విద్య జానపద భాషలో ఎక్కువగా మార్పులు తెచ్చాయి.

జానపద భాషలో టివి మాధ్యమం భాష, అదీ సీరియళ్ళలో పాత్రలు మాట్లాడే భాష బాగా ప్రచారంలోనికి వచ్చింది. సీరియల్‌ పాత్రల భాషలో మాట్లాడడం ఫేషన్‌ అనే స్థితికి వెళ్ళింది. టివి వార్తల్లోని భాషకూడా బాగా వ్యాప్తిలోనికి వచ్చింది. దీని ప్రభావం వల్ల ఇంగ్లీషు విద్య వాప్తి వల్ల కూడా జానపద భాషలో ఇంగ్లీషు పదాల వాడుక చాలా విస్తృతంగా పెరిగింది. యువతరంలోనే కాక పెద్దవయస్సు వారిలో కూడా ఇంగ్లీషు పదాల వినిమయం బాగా పెరిగింది. మాండలిక వ్యక్తీకరణాలలో కూదా చాలా మార్పులు వచ్చాయి.

నగరీకరణం అనేది పల్లెల్లో బాగా వ్యాపించింది. ఈ నగరీకరణం అంటే urbanization అని చెప్పాలి. దీన్నే మరో

పరభాషా దేషం, పరభాషా దాస్యం - రెండూ తప్పే

16

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019