పుట:Ammanudi-June-2019.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాష- పరిణామం

ఆచార్య పులికొండ సుబ్బాచారి 9440493604

తెలుగు జానపదభాష

ప్రభావాలు, పరిణామాలు

“సాహిత్యంలో పరిణామాలు త్వరగా వస్తాయి కాని భాషలో పరిణామాలు చాలా ఆలస్యంగా వస్తాయి. అంటే భాషలో మార్పులు రావడానికి చాలా కాలం పడుకుంది సాహిత్యంలో వచ్చినంత త్వరగా రావు అని ఒకప్పుడు భాషావేత్తలు చెప్పేవారు. కాని నేటి పరిస్థితులు అలా లేవు. భాషలో పరిణామాలు కూడా చాలా వేగంగా వస్తున్నాయి అని చెప్పవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జానపద భాషలో నేటి కాలంలో వస్తున్న పరిణామాలు ఎలా ఉన్నాయి. వాటికి కారణాలు ఏమిటి అని ఇక్కడ పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాను.

జానపద భాష ఏది అనేది చాలా పెద్ద ప్రశ్న దీన్ని తేల్చడం అంత తేలిక కాదు. ఎందుకంటే జానపదులు ఎవరు అని తేలిస్తే కాని జానపద భాష ఏది తేల్చి చెప్పడం కుదరదు. జానపదులు ఎవరు అనే దానిపైన చాలా పెద్ద సిద్దాంత చర్చ జరిగింది. అటువైపు వెళితే సమయం అంతా అక్కడే సరిపోతుంది, అక్కడికి వెళ్ళడం లేదు. కానీ చాలా క్లుష్తంగా ఇక్కడ నాలుగు మాటలు చెబితే కాని ముందుకు నడవడం కుదరదు. తెలుగులో ఈ పని తొలిసారిగా ఆచార్య రామరాజుగారు చేసారు. మౌఖికంగా లఖించే సాహిత్యాన్ని ఏమనాలి అనే సందర్భంగా చాలా విస్తృతమైన చర్చే చేసి అప్పటికి వేరు వేరు పండితులు వాడే చేరు వేరు పదాలన్నింటిని పరిశీలించి జానపద సాహిత్యం అనాలి అదే అన్నింటికన్నా సరైన పారిభాషిక పదం అని తేల్చారు. దాన్ని నేనూ అంగీకరిస్తాను. ఇక ఎవరు జానపదులు అని చెప్పడానికి కేవలం పల్లెల్లో ఉండే వారే జానపదులు అని అనడం కుదరదు నగరంలో ఉండే వారిలో కూడా జానపదులు ఉందవచ్చు అని చెప్పారు. అలాగే పల్లెలో కూడా పండితుడు ఉండవచ్చు నన్నారు. మరి జానపదులు అని ఎవరిని చెప్పాలంటే జానపద మనస్తత్త్వం ఉన్న వారినే జానపదులు అనాలి అని చెప్పారు. దీనిపైన కూడా ఇంకా పెద్ద చర్చ జరగడానికి వీలుంది. జానపద మనస్తత్త్వం అంటే ఏది అని చెప్పాలంటే తిరిగి పెద్ద చర్చే జరగాలి.

మన వద్ద సంగతి ఇలా ఉండగా పాశ్చాత్యులలో కూడా Who are folk అనే విషయంలో పెద్ద చర్చే జరిగింది. చివరికి అలన్‌ డండెస్‌ చేసిన నిర్వచనాన్ని అన్నీ దేశాలలో అంగీకరిస్తున్నారు. చాలా క్లుప్తంగా దాన్ని ఇక్కడ చెబితే “కొన్ని సామాన్య లక్షణాలుండి తమదైన సంస్కృతి సంప్రదాయాలు తాము కలిగి ఉండి దీర్హ కాలంగా ఉన్న ఏ సామాజిక సమూహాన్నైనా జానపదులు అనినీ అనవచ్చు” అని చెప్పారు. దీని ప్రకారం సంప్రదాయ సామాజిక సమూహాలు జానపదులు అవుతాయి. తాత్మాలిక అవసరాలకోసం ఒక చోట చేరిన ఏర్పడిన సామాజిక సమూహాలు జానపదులు అనే నిర్వచనం కిందికి రారు. ఈ నిర్వచనం ప్రకారం ఎవరు జానపదులు కారు? అనే పెద్ద ప్రశ్న ఉదయించింది. తర్వాత తర్వాత దీనికి కొన్ని పరి మితులు ఏర్పరచారు తర్వాతి శాస్త్రజ్ఞులు. కాగా ఇప్పుడు జానపదులు ఎవరు అనే చర్చ ఎక్కడా జరగడం లేదు. అది గతార్ధం అయింది. పై నిర్వచనాన్నే అత్యధికులు అన్ని దేశాలలో పాటిస్తున్నారు.

ఇక జానపద భాష అనగానే ఇప్పటిదాకా తెలుగులో మనకు అవగాహన ఉన్నదాని ప్రకారం గ్రామీణ జీవితం గడిపే వారు, వివిథ వృత్తులలో ఉన్నవారు, విద్యావంతులు లేదా అధిక విద్యావంతులు కాని వారు అనే భావన ఉన్నది. తెలుగులో జునపద సాహిత్య పరిశోధన చేసినవారు ఇలాంటి సామాజిక సమూహాలనుండే సాహిత్యాన్ని సేకరించారు. దీనికి ఒక ప్రమాణంగా గ్రహించిందే మంటే, మౌఖిక సాహిత్యాన్ని సృజించే వారు జానపదులు అనే ఒక ప్రమాణరేఖ ఉంది. సేకరించి పరిశోధించిన సాహిత్యమంతా ఇలాంటి మౌఖిక సాహిత్యమే. దీన్నే జానపద సాహిత్యంగా నేటికీ అంగీకరించి పరి శోధనలు సాగుతున్నాయి.

లిఖిత సాహిత్య పరిచయం లేనివారు అలాంటి చదువులు చదువుకోని వారు జానపదులు అనే ఒక ప్రమాణ రేఖ కూడా ఉంది. ఇక్కడ విద్య అనేదానికి నేను విస్తృతమైన అర్థంలో గ్రహిస్తాను. జానపద శాస్త్రంలో నిరక్షరాస్యులు ॥18/218 అనే పదాన్ని అంగీకరించరు. వారు ౧0౦౧-1648 అనే అభివ్యక్తిని వినియోగిస్తారు. దాని అర్థం ఏమంటే ఒక భాష మాట్లాడేవారు ఎవరూ నిరక్షరాస్యులు కారు. అక్షరాలు రాయడం తెలియని వారు ఉండవచ్చు కాని అక్షరాలు తెలియనివారు ఉండరు అని దీని అర్ధం. అంటే జానపద శాస్త్రం ప్రకారం ఒక భాష మాట్లాడే వారు అందరూ అక్షరాస్యులే అని అర్థం. అక్షరాలు రాయడం అంటే లిపి తెలియనివారు అనే అర్థంలోనే వారినీ చూచి నాన్‌ లిటరేట్స్‌ అనే పదాన్ని వారికి వినియోగిస్తారు. ఇక విద్య అంటే ఇక్కడ ఉన్న అవగాహన కూడా వేరే. కేవలం తరగతులు డిగ్రీలు పొందేదే విద్య అనే భావన ఉంది. కానీ ప్రతి పని ఒక విద్య అని ప్రతి జీవన విధానం ఒక విద్య అని జానపద శాస్త్రం భావిస్తుంది. ప్రతి చేతి వృత్తి దాన్ని నేర్చుకోవడం దాన్ని చేయడం ఒక విద్యే. వ్యవసాయం ఒక విద్య వడ్రంగం ఒక విద్య. వంట గృహనిర్వహణ ఇలా అన్ని రకాల పనులు జీవన విధానాలు కూడా విద్యలే. దీన్ని సాంతిళ శ్యాస్తాలు దాదావు అన్నీ అంగీకరిస్తాయి. కాగా మామూలు అవగాహనలో ఉన్న విద్యని దృష్టిలో ఉంచుకాని జానపదులను విద్యలేని వారు అని చెప్పడం కుదరదు. బెపచారికమైన తరగతులు చదవనీవారు అని చెప్పవచ్చు.

గుండె లోతుల్లోంచి వచ్చెదీ, మనసు విప్పి చెప్పగలిగేదీ 'అమ్మనుడిలోనే

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019

13