పుట:Ammanudi-June-2019.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోవాలనే హెచ్చరికలు వస్తున్నాయి. అసలు పాలించటానికి మీ భాష బ్రతికి ఉంటుందా అనే సవాళ్ళు నిత్యమూ ఎదురవుతున్నాయి. తెలుగు జనమే ఇంగ్లీషు కాన్సెంట్లకు ఎగబడుతుంటే తెలుగు బడులు నిలుస్తాయా తెలుగులో ఫైళ్ళు నడుస్తాయా అని పరిహాసాలు ఆడు తున్నారు. తెలుగు జుతి మనది- నిండుగ వెలుగు జాతి అనే పాటను తెలుగు జాతి మనది- రెండుగ వెలుగు జాతి అని పాడుకుంటున్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు, దిగువ కోర్టుల్లో న్యాయపాలన అంతా మాతృభాషలోనే సాగేందుకు వీలుగా రెండు హైకోర్టులూ సాయపడాలని వేడుకుంటున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు అన్ని కోర్టుల్లో కూడా ఆంగ్లానికే ఆదరణ దొరుకుతోంది. ఎన్నో అవాంతరాలున్నా తెలుగులో తీర్పులు ఇచ్చి కొందరు న్యాయమూర్తులు సాహసోపేతమైన శ్రమ చేశారు.

మాయమాటలు

పాలకుల్లో మాతృభాషాఖిమానం మచ్చుకైనా లేదు. అధికార శ్రేణులకు తెలుగుపట్ల చిన్నచూపు చెప్పనలవికాదు. తెలుగును అధికార భాషగా ప్రకటిస్తూ 1966లో చేసిన శాసనానికి ౩9 సంవత్సరాల తరవాత తీరిగ్గా 2005లో చట్టబద్ధ ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తొమ్మిదికోట్లమంది తెలుగువారికి సేవలందించవలసిన లక్షలాదిమంది ఉద్యోగులు వాస్తవానికి తెలుగులోనే పనిచేయవలసి ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు వారి భాషలోనే పనులు చేసిపెట్టవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన, అధికారులపైన ఉన్నది. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ విధిగా తెలుగుభాషలోనే సాగించాలనేగా భాషాదినోత్సవాలలో పాలకులు మాట్లాడేది? మరి ప్రజలలో ఈ ఇంగ్లీషు మోజు పెంచేది ఎందుకు? పైశాచిక భాషానువాదాలతో తెలుగు అంటేనే ప్రజలు Tఠారెత్తిపోయేలా బ్యూరోక్రసీ కసిగా వెలగబెట్టిన నిర్వాకాలు ఎన్నో! 2013లో ఏర్పాటు చేసిన తెలుగు భాష సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా గానీ 2018 లో ఏర్పాటు చేసిన తెలుగు భాషాఖివృద్ది ప్రాధికార సంస్థ ద్వారా గానీ ఏమేమి పనులు చేయించుకున్నారు?

భాష విషయంలో పాలకుల సంకల్పాలు, ప్రమాణాలు, గొప్పగా ఉంటున్నాయి. కానీ ప్రభుత్వాల ఉత్తర్వులు మాత్రం అమలు కావడం లేదు. తెలంగాణాలో సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషాభివృద్ది ప్రాధికార సంస్థ వచ్చాయి. పాలనలోనూ, చదువుల్లోనూ తెలుగు కచ్చితంగా ఉండాలి. కార్యాలయాలలోనూ, పాలనలోనూ, కోర్టుల్లోనూ తెలుగును వెలిగించాలి. చిత్తశుద్దిలేని నాయకుల మాటలతో ప్రజలలో నమ్మకం పోయింది. కూడు పెట్టని భాష మనకు - కోటీశ్వరులయ్యే చదువులు వాళ్ళకా? అని పేద ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ విమర్శలను సాకుగా చూపి పాలకులు అసలు తెలుగు మాధ్యమానికే ఎసరు పెడుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే తెలుగు మాయం “తెలుగు రాష్ట్రాలు రెండూ భాషను కాపాడేందుకు కట్టుబడాలి. మాతృభాషలోనే మాట్లాడండి, మాతృభాషను ఎవరూ మరిచిపోవద్దు” అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెబుతున్నారు. స్కూళ్ళలో తెలుగు నేర్పుతుంటే కదా పిల్లలకు ఆభాష వచ్చేదీ మాట్లాడేది ? ప్లేస్కూల్‌ పేరిట మూడో ఏడు దాటగానే బడిలో వేస్తున్నారు. వారికి...మొదలు పెట్టడమే ఏ ఫర్‌ యాపిల్‌ *“అ- అమ్మ, ఆ - ఆవు” అని తెలుగు అక్షరాలు నేర్చించరు. కొన్ని స్తూళ్లలో ఐదో తరగతి దాకా తెలుగు చెప్పనే చెప్పరు. 6, 7, 8 తరగతుల్లో మొక్కుబడిగా చదివితే చాలు. 9, 10లో తెలుగు ఆప్పనల్‌ మాత్రమే! అంటే...ఇస్టముంటేనే తీసుకోవచ్చు. ఇంటర్‌లో కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ భాషగా ఆంగ్లం, ద్వితీయ భాషగా సంస్కృతం మాత్రమే బోధిస్తారు. అసలు ఎక్కడా తెలుగు కనీపించదు. త్రిభాషా సూత్రం అమలు కాగితాలకే పరిమితమవుతోంది. నాయకుల హామీల ప్రకారం ఎలిమెంటరీ స్థాయిలో పూర్తిగా మాతృభాషలోనే బోధన ఉందా? ప్రైవేటు స్యూళ్లన్నీ ఇంగ్లీషు మీడియమే! ప్రైవేటు బడుల్లో బోధనా మాధ్యమంగా తెలుగు ఎప్పుడో మాయమైపోయింది. ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇది మిగిలి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్దుల సంఖ్య నానాటికీ పడిపోతోంది. ప్రైవేటు, కార్పొరేట్‌ బడుల్లోని “ఇంగ్లీషు మోజే దీనికి కారణం. ప్రైవేటు స్కూళ్లను తెలుగు బాట పట్టించాల్సిన ప్రభుత్వం... తానే ఆంగ్ల మాయలో పడుతోంది. మునిసిపల్‌ పాఠశాలల్లో తెలుగు మీడియంను తగలేస్తూ... ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతోంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తెలుగు రాకపోవడాన్ని గర్వంగా చెప్పుకొంటున్నారు. తెలుగులోనే డిగ్రీ దాకా చదివి, తెలుగు సాహిత్యమే ఆప్పనల్‌గా తీసుకొని, తెలుగులోనే ఇంటర్వ్యూకి హాజరై సివిల్స్‌లో తెలుగు మాధ్యమంతోనే మూడవ ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణను మనం గుర్తు తెచ్చుకోవాలి.

తెలుగు రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్లు తెలుగు మాధ్యమానికి అండగా ఉండాలి తెలుగు రాష్త్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్లు తెలుగు మాధ్యమ విద్యార్దులకు ఎంతో సేవ చేయవచ్చు. ఇవి జరిపే గ్రూప్‌ 1 2, 3, 4 ఉద్యోగ నియమకాలలో డిప్యూటీ కలక్టర్‌,మున్సిపల్‌ కమిషనర్‌, ఏసీటీఓ,సబ్‌ రిజిస్ట్రార్‌, డిప్యూటీ తహసిల్టార్‌, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌, ఎక్ట్నన్ షన్ ఆఫీసర్‌, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, సీనియర్‌ ఆడిటర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ జూనీయర్‌ అకౌంటెంట్‌ జూనీయర్‌ అసిస్టెంట్‌, గ్రామపంచాయతీ సెక్రెటరీ లాంటి వన్నీ తెలుగులో చేసే ఉద్యోగాలే. ఇవన్నీ ఐ ఏ ఎస్‌, ఐ పి ఎస్‌ లాంటి ఉన్నతోద్యోగాలు కావు. తెలుగు ప్రజలతో మమేకమై. వారితో ముఖాముఖీ తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగాలు.

తెలుగు ప్రజల సమస్యలను సరిగ్గా విశ్లేషణ చేయాలి. గ్రామ సామాజిక, ఆర్థిక వ్యవస్థపై తగిన అవగాహన తెచ్చుకోవాలి. ప్రజా పరిపాలన పై పరిజ్ఞానం 'పెంచుకోవాలి. అక్కడి ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్మారాలు, సూచనలు వినాలి, రాయగలగాలి. ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాషలో తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి.

రచయిత - విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలక్టర్‌, అమరావతి

ఓట్లు అడిగేది తెలుగులో... పరిపాలించేది ఉత్వర్వులిచ్చేది ఇంగ్రీషులోనా?

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019

7