పుట:Ammanudi-June-2019.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోనే ఉద్యోగాలొస్తాయని, మున్సిపల్‌ పాఠశాలలన్నింటిలో తెలుగు మాధ్యమం తీసేసి ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశ పెడతామని ప్రకటించారు. ఎవరిమాటలు నమ్మాలి? ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషను నేర్చుకొనే అవకాశం కోల్పోయి మరోసారి స్వాతంత్య్రాన్ని కోల్పోయాము. గత్యంతరంలేక పరాయిభాషలోకి తప్పనిసరై కావాలనే మన పిల్లల్ని నెడుతున్నాము. తెలుగులోనే పరీక్షలు రాసి, ఆ భాషలోనే ముఖాముఖిలో పాల్గొని, కేంద్రప్రభుత్వ అధికారులుగా ఎంపికైనవారు ఎంతమంది లేరు ? అలా మాతృభాష ద్వారా ఉద్యోగాలను సాధించే స్థాయికి మన పిల్లలను తీసుకెళ్ళాలని మన నాయకులు కూడా కోరుకోవాలి కదా?

సర్వీస్‌ కమీషన్‌ ఉద్యోగాలలో తెలుగు మాధ్యమం ద్వారా డిగ్రీలు చేసిన వారికి ఎన్ని దక్కుతాయి ? ప్రజల భాషకు పరిపాలనలో పట్టం కడతామనే నాయకుల వాగ్గానాలు రెండు రాష్ట్రాల్లోనూ వినబడు తున్నాయి. తెలుగును ఉపాధి వనరుగా మార్చాలని అందరూ కోరు తున్నారు. కొందరైతే ప్రజల భాష పదికాలాలపాటు పాలించాలని తపిస్తున్నారు కూడా. తెలుగు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు పొందేలా చెయ్యాలి. మన; ప్రజా సేవ (పబ్లిక్‌ సర్వీస్‌) కమీషన్లు. 1985 వరకు పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ పోటీ పరీక్షల్లో తెలుగు మీడియం డిగ్రీ విద్యార్థులకు ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహక మార్కులు హైకోర్టు తీర్పుతో ఆగిపోయాయి. ప్రభుత్వం హై కోర్టులో అప్పీల్‌ చేసి మార్ముల పునరుద్ధరణకు ప్రయత్నించాలి. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 సర్వీసు ఉద్యోగాలలో డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి. తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే అభ్యర్థులకు దారి ఇవ్వాలి. ఆఫీసుల్లో తెలుగు బ్రతకాలి. తెలుగు మీడియంలో చదివితే ఉద్యోగాలు రావాలి. మన పిల్లలు తెలుగులో చదవాలి. తెలుగు అధికారులు తెలుగులో కార్యాలయాలు నడపాలి. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయాలి. అప్పుడు జనం తండోపతండాలుగా తెలుగులో చదువుతారు. తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు సర్వీసు కమీషను పరీక్షల్లో రిజర్వేషన్లు, ప్రోత్సాహక మార్కులు తిరిగి ఇప్పించటానికి కృషి చేస్తామని 2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇచ్చిన హామీపై జీవోలు ఇవ్వాలి.

"""తెలుగు భాషలో సాధికారత ఏదీ?

ఎవరి భాషలో వారికి విద్యను బోధిస్తేనే ప్రయోజనమన్నారు గిడుగు రామమూర్తి. బడి పలుకుల భాష కంటే పలుకుబDuల భాషే అవసరమని కాళొజీ చెప్పారు. అసలైన పురోగతి మాతృభాషతోనే సాధ్యమని గాంధీజీ వాదించారు. అమ్మభాషలో బొధన విద్యార్ధి సృజనను ఎంతో పెంచుతుందని విశ్వకవి రవీంద్రుడు భావించాడు. ఇవేవీ పట్టించుకోకుండా ఇంగ్లీషులో మాత్రమే నేర్పుతున్న చదువు పిల్లలకు భారంగా మారింది. కళాశాల విద్య అర్థం కావటం లేదు. పని మీద ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవారికి అక్కడ ఏమి జరుగు తుందో తెలియటం లేదు. న్యాయస్థానాల్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారో, అక్కడ జరుగుతున్న ప్రక్రియ కక్షిదారులకు అంతుపట్టడం లేదు. ఇటు సొంత తెలుగు భాష చెల్లక, అటు పరాయి కోర్టు భాష సాంతం తెలియక, ఎంతకీ అవగతం కాక అవస్థ పడుకున్నారు. సొంత భాషలో చెప్పుకోలేను, పరభాషలో నవ్వలేను, ఏడలేను అన్నట్లు మారింది పరిస్తితి. అర్థమైనా కాకపోయినా ప్రతి విషయం ఇంగ్లీషులోనే చెప్పుకోవాల్సి వస్తోంది. మాతృభాషలో స్వేచ్చగా మాట్లాడే భాగ్యాన్ని పోగొట్టుకున్నాం. సొంత మాటలను, పదసంపదను పోగొట్టుకొని మూగవాళ్ళలాగా బ్రతుకుతున్నాం. భాషా దారిద్య్రం, భావ దారిద్య్రం రెండూ మన ప్రజల్ని బాధించేలా మన పాలన, విద్యా, న్యాయ రంగాలను తయారు చేశారు.

భాషా ప్రయోజనాల్ని అందరి దరికీ చేర్చే బాధ్యత ప్రభుత్వానిది. తెలుగునాట తెలుగు భాషాబోధనను నిర్చంధం చేయాలి. ప్రాథ మిక దశ నుంచి ఉన్నత పాఠశాల చదువు ముగిసే పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే బోధించాలి. పాఠ్యపుస్తకాల్ని పిల్లలందరికీ బాగా అర్ధమయ్యేలా రూపొందించాలి. కన్నడ భాషాబొధనను అక్కడి ప్రభుత్వం ఉన్నత పాఠశాలదాకా నిర్చంధం చేసింది. కర్ణాటకలో పనిచేసేవారికి ఆ భాష తప్పనిసరిగా తెలిసి ఉండాలని తేల్చిచెప్పింది. తమిళనాడులో మాతృభాషలో చదివితేనే అక్కడ ఉద్యోగాలిస్తారు, మలయాళ భాష, సంస్కృతిని పదిలపరచుకొనేందుకు అక్కడ ప్రత్యేకంగా ప్రాధికార సంస్ద ఏర్పాటైంది. ఒడిశా, గుజరాత్‌, పశ్చిమ్‌ బంగ, మహారాష్ట్రల్లోనూ చదువుల్లో, ఉద్యోగాల్లో అక్కడి మాతృభాషలకే పెద్దపీట వేస్తున్నారు.

ఆంగ్లంలోని గ్రంథాల్ని ఇజ్రాయెల్‌ తన భాషలోకి కొద్దికాలంలోనే తర్జుమా చేసుకొంది. అత్యాధునిక పరిజ్ఞానానికి సంబంధించిన ఏ పదమైనా వెంటనే స్వీడన్‌ భాషలోకి అనువాదమవుతోంది ఉన్నత న్యాయ స్థానాలలో తెలుగు కనీసం ప్రవేశిస్తుందా? మన పాఠాల్లో ఉన్న తెలుగు” ఎంత? ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో తెలుగు మాయమవుతోంది! “మార్కులకు పనికిరాని” సబ్జెక్టుగా మిగిలిపోతోంది. తమిళనాడులో సెంట్రల్‌ సిలబస్ లొనూ తొమ్మిదవ తరగతి వరకు తమిళం తప్పనిసరిగా బోధించాల్సిందే. తెలంగాణలో పాఠశాల నుంచి జూనియర్‌ కళాశాల వరకు ఒక బోథనాంశంగా తెలుగు ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. తెలుగును బోధించే విద్యాలయాలకు మాత్రమే తెలంగాణలో అనుమతి దక్కు తుందన్నాడు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నామఫలకాలపై తెలుగు విధిగా కనీపించాలన్నాడు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏమిటి పరిస్థితి?

హైకోర్టులో తెలుగు వాదన పనికిరాదు పొమ్మన్నాదో ప్రభుత్వ న్యాయవాది. 1952 లో తెలుగు భాష పేరుతో మన రాష్ట్రం ఏర్పడింది. భాషా ప్రయుక్త ర్యాష్టాలలో మనదే మొదటి రాష్ట్రం. భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు ఉద్దేశం ఏమిటి? తెలుగు రాష్ట్రాన్ని తెలుగులోనే పరిపాలించటం. గత 66 సంవత్సరాల సుధీర్ల కాలంలో తెలుగు పాలన సిద్దించిందా? ఏమి ఆశించి భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాలు ఈనాటికీ నెరవేరకపోగా భవిష్యత్తులో కూడా ప్రజల భాషలో పాలన నడుస్తుందనే ఆశలుకూడా వదులు

"""సంస్కృతాన్ని అడ్డు పెట్టి తెలుగు కాంతినాపలేరు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019

11