పుట:Ammanudi-June-2019.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుస్తకాలలోకి తీసుకోవాలి.

ప్రొత్సాహకాలతోనే తెలుగు వృద్ధి

తెలుగు మాధ్యమంలో చదివి ప్రభుత్వ ఉద్యోగాలకోసం తెలుగులో పరీక్షలు రాసేవారికి 5 శాతం మార్కులను అదనంగా కలిపినా, తెలుగు మాధ్యమంలో డిగ్రీ వరకు చదివిన పిల్లలకు మొత్తం ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్‌ కల్పించినా తెలుగు భాషకు గొప్ప మేలు జరుగుతుంది. నానాటికి నీరసించి పోతున్న భాషకు బలవర్ణక బెషధాలు ఇవ్వాలి కానీ అసలు ప్రోత్సాహకాలేమీ ఇవ్వకూడదు అని కొందరు తెలుగు వాళ్ళే వాదిస్తుండటం విచిత్రంగా ఉంది. బలహీన వర్షాలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎక్కదీసుకొచ్చినట్లే మన మాతృభాషలకు కూడా ప్రోత్మాహకాలిచ్చి బలపరచాలి, బ్రతికించాలి. డబ్బురాని విద్య దరిద్రానికే అంటారు. ఏ ఉద్యోగమూ రాక ఎందుకూ పనికిరాక సోయేటట్లయితే తెలుగులో ఎవరు చదువుతారు? ఎందుకు చదువుతారు? తెలుగు చదవడాన్ని పెంచాలంటే ప్రోత్సాహకాలు కూడా ఉండాల్సిందే.

1985 పరీక్షల వరకూ తెలుగు మీడియం అభ్యర్థులకు ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహక మార్ముల పునరుద్ధరణకోసం ప్రభుత్వం అసలు కోర్టులో ప్రయత్నమే చేయలేదు. ప్రోత్సాహక మార్కుల కేసులో దీటుగా ఎదుర్శొని వాదించగల తెలుగు న్యాయవాదిని నియమించి మార్ముల పునరుద్దరణ జరపాలి. ప్రజల భాషకు వ్యతిరేకంగా తమిళనాడులో ఎవరైనా న్యాయస్థానాలకు వెళితే ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకొంటున్నట్లుగా మన ప్రభుత్వం కూడా తీవ్రంగా తీసుకోవాలి. విషయం కోర్టులో ఉందన్న సాకుతో తెలుగు విద్యార్థులకు ప్రోత్సాహకాలు ప్రకటించటాన్నీ మరచిపోకూడదు. 5 శాతం అదనపు మార్కులను ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది.

తెలుగు మాధ్యమం వారికన్నా ఇతర మాధ్యమాల వారు ఉద్యోగాలకు జరిగే పరీక్షల్లో చాలా ఎక్కువ మార్కులు ఎందుకు తెచ్చుకొంటున్నారు? పిల్లల చదువు మీద శ్రద్ద పెట్టే కుటుంబాలు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమానికే ఎందుకు పంపుతున్నాయి? ఆంగ్ల మాధ్యమ పంతుళ్ళ స్థాయిలో తెలుగు మాధ్యమ పంతుళ్ళకు కూడా జీతాలు ఇవ్వగలిగితే తెలుగు విజ్ఞానులు తెలుగునేలపైనే నిలబడతారు. తెలుగులో పోటీ పరీక్షల పుస్తకాలు వెల్లువెత్తుతాయి. తెలుగులో చదివితే కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయనే ధీమా ప్రభుత్వం కల్పించక తప్పదు. ప్రజలు ఏ పనికైనా ప్రయోజనం ఆశిస్తారు. ప్రజల పక్షాన ప్రభుత్వం ఉంటే ప్రజలూ ప్రభుత్వాన్ని నిలుపుకుంటారు. మనిషి ఆశాజీవి. ఎక్కడ లాభం ఉంటే అక్కడికి చేరతాడు. తెలుగు విద్యార్థుల్ని కాపాడుకోవటం ద్వారానే తెలుగును రక్షించుకోగలం. ఈ మర్మాన్ని గ్రహించే తమిళనాడు ప్రభుత్వం 20 శాతం రిజర్వేషన్లు తమిళ విద్యార్దులకు కల్పించింది. అక్కడ ఎలా సాధ్యమయ్యిందో కనుక్కొని అదే పద్దతి ఇక్కడ మనమూ అనుసరించాలి. అప్పుడు ఆంగ్ల మాధ్యమం వాళ్ళు కూడా తెలుగు మాధ్యమంలో చదవడానికి తరలివస్తారు. తమిళనాడులో నివసించే విద్యార్థులు తమిళంలో చదవక తప్పదు అని దివంగత ముఖ్యమంత్రి జయలలిత హోసూరు ఎమ్మెల్యే గోపీనాథ్‌కు అసెంబ్లీలో తెగేసి చెప్పారు. అక్మడ రాని పెను ప్రమాదం ఇక్కడ ఎందుకు వస్తుంది? భాష విషయంలో తమిళనాడునే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ రాష్ట్రం తమిళాన్ని అభివృద్ధి చేసుకోటానికి ఎన్ని మార్దాలున్నాయో అన్ని మార్గాలూ అన్వేషించి సఫలమయ్యింది. అందువలన పై ప్రతిపాదనలకు తోడు ఉద్యోగ నియామక పరీక్షలలో తెలుగును ఒక కంపల్సరీ సబ్జెక్టుగా పెట్టాలి. ఈ నియమం వల్ల అభ్యర్ధులు తెలుగు మాధ్యమంలో చదివి తెలుగు బాగా నేర్చుకొని పాస్‌ కాక తప్పదు. ప్రభుత్వ ఉద్యోగాలకు తెలుగు తప్పనిసరి కావాలి.

ప్రభుత్వోద్యోగులు ప్రజల దగ్గరకు వెళ్ళాలి, వారి సమస్యలు వినాలి, వారికి అర్హమయ్యేట్లు పరిష్కార మార్గాల గురించి వారి భాషలోనే చెప్పాలి. కాబట్టి వారికి తెలుగులో పరిజ్ఞానం ఉండాల్సిందే. ఇంట గెలిచి రచ్చ గెలవాలి రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలి. అన్ని ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి తెలుగు భాషనే ఉపయోగించాలి. ఆంగ్లం వాడకూడదు. కేంద్ర ప్రభుత్వం, ఇతర ర్యాష్టాలు, రాష్ట్రం వెలుపల ఉన్న చిరునామాదారులతో మాత్రమే ఆంగ్లం ఉపయోగించాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలు, అన్ని స్థానిక సంస్థలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి. అన్ని శాసనేతర అవసరాలకు ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలకూ తెలుగు భాషనే ఉపయోగించాలి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు నియమాలు, నిబంధనలు, ఉపవిధులు అన్నీ కూడా తెలుగు భాషలోనే ఉండాలి. రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, సముదాయాల బోర్జులు ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ నామఫలకాలు, శంకుస్థాపన శిలాఫలకాలు తెలుగులోనే రాయించాలి. తెలుగు మన ప్రజల భాష. ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఆఫీసర్లు కూడా అరు నెలల్లో తెలుగు నేర్చుకోవాలి. తెలుగులో సంతకంపెట్టాలి. తెలుగులో నోట్స్‌ రాయాలి.తెలుగుపిల్లలు తెలుగులోనే ఎందుకు వెనుకబడి ఉండాలి? మాతృ భాషలో వెనుకబడేవాళ్ళు అన్ని భాషల్లోనూ వెనుకబడే ఉంటారు. ఇంటగెలిచి రచ్చ గెలవాలి. మాతృభాషకు ఇచ్చే ప్రోత్సాహకాల పైన ఇక ఎవరు న్యాయస్థానాలకు వెళ్ళకుండా చట్టంలోనే నియమం పెట్టాలి.

తెలుగు మాధ్యమ అభ్యర్థులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు

డిగ్రీ తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని ఆనాటి మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, భూమా అఖిలప్రియ వాగ్దానం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇంగ్లీషు మీడియంలోనే ప్రవేశపెడతామన్నారు. ఇంగ్లీషు మీడియం లేకపోవటం వల్లనే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతున్నాయనీ, విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నదనీ ఉభయ రాష్ట్రాల్లో చర్చ నడుస్తున్నది. మునిసిపల్‌ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దుచేస్తూ; ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.మరోవైపు రాష్ట్ర మంత్రి నారాయణ; తెలుగు మాధ్యమంలో చదువుకుంటే ఉద్యోగాలు రావని, ఇంగ్లీషు మాధ్యమం

తెలుగును బోధించడం కాదు ; తెలుగులోనే అన్నీ బోధించాలి

10

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019