పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ అధ్యాయము

63


ప్రాతినిధ్యపు హక్కులకు వారర్హులనియు వారి యనుమతి లేనిది పన్నులు వేయుట ఆక్రమ మనియు ఆయన చెప్పిను. ఇందు మీద పార్లమెంటు సభలో కొంత చర్చ జరిగెను, ఆ చర్చలో పార్లమెంటు సభ్యులలో నైకమత్యము లేక భేదా భిప్రాయములుఁడుటవలన అమెరికా వారి రాజద్రోహమునకు మంచి ప్రోత్సాహము కలుగనున్నదని గ్రెగ్వెలు చెప్పెను. అందుమీద విలియంపిట్టు "అమెరి కావలస ప్రజలు మూర్కపు పట్టుదలలో నున్నారని ఆయన ఆక్షేపించి యున్నాడు. అంతే కాదు. అమెరికా దాదాపుగా బహిరంగమగు తిరుగుబాటును చేయుచున్నది. అమెరికావారు మనను ఎదిరించినందునకు నేను సంతసించుచున్నాను. వెంటనే స్టాంపుల చట్టమును తీసివేయుడు. కాని మన దేశమునకు వలస రాజ్యముల మీదగల ప్రభుత్వాధికారమును మిక్కిలి బలమగు మాటల చే స్థిర పరచి వారి వర్తకమును, వారి పరిశ్రమలును, మన యధికారమునకు పూర్తిగ లోబడునట్లు చేయుడు. వారి యనుమతి లేకుండ వారివద్దనుండి బలాత్కారముగ సొమ్మును, మాత్రము వసూలుచే యవలదు” అని జవాబు చెప్పెను. విలియంపిట్టు యొక్క సలహా అంగీకరించబడినది. వెంటనే " అది అమలులో నుంచుటవలన అనేక ఇబ్బందులకాకరమగు ననియు ఈ రాష్ట్రముల వర్తకమునకు నష్టము కలుగ వచ్చు సనియు” నని స్టాంపుల చట్టమును ఆంగ్లేయ పార్ల మెంటువారు రద్దుపరచిరి, కాని అమెరికాలోని రాజు గారి రాజ్యములు రాజు గారిమీదను గ్రేటు బిటను యొక్క పార్లమెంటుమీదసు నెర్కుడు నాధారపడుటకై యధికార ప్రకటణా