పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

అమెరికా సంయుక్తరాష్ట్రములు


శాసనమును ఆకాలముననే చేసి.. ఈశాసనమున అమెరికాలోని వలన రాజ్యముల ప్రజలు గ్రేటు బ్రిటన యొక్క రాజునకును పార్లమెంటువారికిని లోబడియున్నారనియు వారు మీద ప్రతి హక్కుకును ఆధారపడియున్నార:య, ప్రతి విషయములోను పార్ల మెఁటు యొక్క సలహాతో రాజు చేయు చట్టములను ఉత్తరుపులను అన్నియు అమెరికా వలస ప్రజ లను పూర్తిగా బద్దులను చేయునియు, ఇటు బద్దులను చేయ నేరని వలస రాష్ట్ర ములలో నెవరైనను చేసుకొను తీర్మానములును అశాస్త్రీయము లై చెల్ల నేర వనియు ప్రకటించ బడెను.


అమెరికా వలస ప్రజలీ యధికార ప్రకటనా శాసనమును ప్రధమములో బాగుగమనించలేదు స్టాంపుల చట్టము తీసి వేయబడి నందుకు మిగుల సంతసించిరి దేవాలయము లో జయసూచకముగ గంటలు మోగించబడెను. బాస్టసులో మే 19 వ తేదీన అన్ని వ్యాపారములకును శెలవిచ్చిరి, ఇంగ్లాండు నుంచి వచ్చెడి వస్త్రములను ధరించుట మానివేసిన ఆమెరికను స్త్రీలు జూన్ 4వ తేదీన రాజు యొక్క జన్మదినమయినందున నూతన ఆంగ్లేయ వస్త్రములను కొని ధరించి పాత వస్త్రములను బీదల కిచ్చిరి.

(4)

ఈ అనుకూల పరిస్థితులు విశేష కాలము నిలువలేదు. ఆంగ్లేయ ప్రభుత్వము వారీవలస రాష్ట్రములనుండి పన్నులను