పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

అమెరికా సంయుక్తరాష్ట్రములు


'మొదలగు సరకులను తాము బహిష్కరించెదమని వలస రాజ్యముల ప్రజలు శపధములను గావించిరి. ఈవిషయమున ఆమెరికను స్త్రీలు మిగులు పట్టుదలతో పనిచేసిరి. వారు ఆంగ్లేయచ్ఛస్త్రములు ధరించుటను మానివేసిరి. స్టాంపుల చుట్టము చేయబడిన నాటికిని దీని నమలులో బెట్ట నిర్నయించిన కాలమునమద్య నాంగ్లేయ మంత్రివర్గములో మార్పులు కలిగెను. గెంవిలు మంత్రియు నాయస సహచరు లును మంత్రి పదవులను వదలుకొనిరి. రాకింగుహాం ప్రధా నమంత్రి యయ్యెను. . ఈయపకు ఆమెరికా వలస ప్రజలయం దిష్టమేగానీ అప్పుడు రాజ్యముచేయుచున్న మూడవ జూర్షి రాజు మంత్రుల మీద బాగుగ సధికారము చలాయించుచుండెను. ఈ రాజద్రోహులగు ఆమెరికనులను బాగుగ శిక్షించవలెనని ఆయన పట్టుదల గలిగియుండెను. అయినను అమెరికాలోని వ్యవ హారములు విషమస్థితికి వచ్చుచున్నందున విశేష యనుభవజ్ఞు డగు విలియంపిట్టు యొక్క సలహాము తీసుకొనుటకు నిశ్చయించిరి. విలియంపిట్టు చాల ప్రఖ్యాతి వహించిన రాజనీతి కోవిదుడు. ఆయ న కొంతకాలము నుండియు సనారోగ్యముచేత పార్లమెంటుకు వచ్చుట లేదు. అమెరికా విషయమున నాలోచించుటకై నిర్లయ మైనదినమున నాయస పార్లమెంటు సభకువచ్చెను. అట్లాంటికు , మహాసముద్రమున కావలియొడ్డుననున్న నీతి పరులైనట్టియు ధైర్యశాలులయినట్టియు మూడుకోట్ల పౌరుల స్వతంతమును భంగపరచుచున్న సందర్భములో తాను తన యుభిప్రాయములను ఖండితముగ తెలుపుట కే వచ్చితిననియు, అమెరికావారింగ్లాండు యొక్క. ఫుత్రులేగాని దాసి పుత్రులు గారనియు,