పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

అమెరికాసంయుక్త రాష్ట్రములు



స్వాతం త్య యుద్ధమునాటికి ముప్పదియైదు లక్షలు. ఈ రాష్ట్ర ముల వారు వ్యవసాయమువలనను పరిశ్రమలవలనను చాలధనము నార్జించు చుండిరి. కొద్ది కాలములో మిగుల ధనవతుల యిరి. జార్జియారాష్ట్రము యొక్క వరిపొలములను కారొలీనా రాష్ట్ర ముల నీలిమందు భూములను పర్జీ నియయొక్క పొగాకు తోటలను దున్నుటకు అయిదు లక్షల నల్ల (నీగ్రో, బానిస లను ని మించిరి. పాఠశాలలను స్థాపించుకొని చక్కగా పిల్లలకు విద్య చెప్పించుకొనుటలో న్యూ ఇంగ్లాండు రాష్ట్ర ముల వారు మార్గదర్శకు లైరి. తక్కిన వారు వారినను కరించి విద్య, ధనము, సంఖ్య వృద్ధి అయిన కొలదియు నీ రాష్ట్రముల ప్ర జల లో స్వాతంత్రము నందు పట్టుదల హెచ్చెను.

(3,

{స్టాంపు పన్నులు

17: వ ... - జంగ్లా సి ప్రధానమంతి) ₹్వలు అమెరికా మన రాష్ట్రముల -- కూడ స్టాంపు పన్నులు వసూలు సే సెదమని తెలియ పరచెను. ఈపన్నులను విధించవలదని ఆరు రాష్ట్రముల ప్రజాప్రతినిధి సభలనుండి అర్జీలను పంపుటయే గాక వారి తరఫున కొందరు ప్రతినిధుల నింగ్లాంకునకు 'రాయ బారముకూడ పంపిరి. అట్లు వెళ్ళినరాయ బారులలో సుప్రసిద్దుడగు బెంజమిన్ ఫ్రాంక్లె ను ముఖ్యుడు కాని వీరి రాయ బార ములకును ఆర్జీలకును పెడచెవిని బెట్టి 1765, సంవత్సరము మార్చి 22వ తేదీన నాంగ్లేయ పభుత్వము వారొక స్టాంపు చట్టమును చేసిరి. దీనిలో ఇరువది రెండు శిక్షనులు గలవు.