పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

అమెరికా సంయుక్త రాష్ట్రములు


ఆంగ్లేయ దేశమునందు రెండుసంఘము లేర్పడెను. వాటిలో " లండను సంఘమనునది వర్జీనియాను స్థాపించెను. 1606 వ సం -వత్సరమున నిచటికి నూట అయిదుగురు ఆంగ్లేయులు మాత్రము వచ్చి నివసించిరి. వారిలో నలుగురు వడ్రంగులను పన్నెం డుమంది కార్మికులుసు సుండిరి. ఏసుక్రీస్తు ప్రభువు తల్లియగు ! వర్జిన్ మేరీ పేరున వర్జీనియా యని నీ ప్రదేశమునకు నామకరణ "మిడిరి. క్రమముగా నాంగ్లేయ దేశమునుండి చాలమంది వచ్చి చేరుచుండిరి. ఇచట పొగాకు విశేషముగా పండించబ డెను. ఇందువలన వీరు చాల ధనికులైరి. 1619 సంవత్సరమున నాంగ్లేయరాజు యొక్క అనుజ్ఞను పొంది యీ రాష్ట్రపాలవమునకుగాను ప్రజా ప్రతినిధి సభను స్థాపించుకొని.. 1622 వ సంవత్సరమున షుమారు నాలుగు వేల ఆంగ్లేయులిచట కాపుర ముండిరి, ఇరువదియొక్క సంకత్సరములలో జన సంఖ్య రెండు రెట్లధికమయ్యెను. 1620 సంవత్సరముననే యొక పోలండు యుద్ధనౌక ఈ రాష్ట్ర తీరముననకు వచ్చి ఈ రాష్ట్రవాసులకు ఆఫ్రికానుండి తేబడిన నల్ల నీగ్రోబానిసల నమ్మినది. తదాది ఇచటకు నీగ్రోబానిసలు తేబడుట ప్రారంభమయ్యెను. ఎర్ర యిండియనులకుమ ఈ తెల్ల ప్రజలకును అప్పుడప్పుడు కలతలు గలిగి ఎర్రయిండియనులు వీరిమీదపడి హత్యలు జరుపుటయా, వీరు వారినిచంపి వారి దేశము నాక్రమించుటయు జరుగుచుండెను. కొత్తగా కాపురస్తులను 'తెచ్చియుంచుటకు ప్రతి భూకామందునకును ఏబది యెకరముల స్థలమీయబడెను. - ఇందులో ఆంగ్లేయ దేశమునుండి కొత్తవారువచ్చి నివసించు చుండిరి. మరియు సాంగ్లేయదేశములో గొప్ప నేరములు