పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అధ్యాయము

23



చేసినవారినికూడ నిచటకే కాపురము నకు బంపుచుండిరి. పట్టణములును పరిశ్రమలును వృద్ధిమెంద లేదు. కాని తోటలు విశేషముగా పెరిగినవి,

(3)

{మేరీలాండు}

ఆంగ్ల దేశపు రాజగు మొదటి చార్లెసు వద్దనుండి దానపట్టాను పొంది 1684 న సంవత్సరమున నిచట బాల్టిమోరు ప్రభువుయొక్క కుమారుడొక యాంగ్లేయుల వలన నేర్పరచెను. రోమను కాథలిక్కులగు ఆంగ్లేయ దేశములో మిగుల బాధలు గలగుచున్నం దున చాలమంది రోమను కాథలిక్కులగు ఆంగ్లేయులిచటకు వలసవచ్చిరి. వీరిని ప్రధమమున ఎయిండియనులు స్నేహమగ నాదరించిరి. ఎర్రయిండియను స్త్రీలు ఆంగ్ల స్త్రీలకు మొక్కజొన్నలతో రొట్టెటచేసికొనుటను నేర్పిరి. ఆరు నెలలో నీరాష్ట్రము విశేషముగా పెరిగెను. కొలది కాలములో నే ఎర్ర యిండియసులకును వీరికిని కలతలు కలిగెను. వీరి ముఖ్య పంటదినుసుకూడ పొగాకే.

(4)

{ఉత్తర దక్షిణ
కారోలినా రాష్ట్రములు

కారొలీనా రాష్ట్రమును ,ప్రధమమున పరాసు వారు స్థాపించిరి. తరువాత నిది విభజింపబడి ఉ ఉత్తర, దక్షిణ, తర దక్షణ కారొలీనాలను రెండు రాష్ట్రములుగ చేయబడెను. పరాసువారు స్పైన్ వారిచే చాలవరకు చంపబడిన తరువాత 1068వ సంవత్సరమున నాంగ్లేయులిచట వలస నేర్పరచుకొనిరి. తన బానిసలమీద ప్రతి తెల్ల యజమానికిని సంపూర్ణమగు నధికార ముండవలెననియు యజమాని బానిస ఏమిచేసినను ----