పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అధ్యాయము

21


నకు తెలిసి పరాను సేనానియగు గర్నను మూడునౌకల మీద కొంత సేసతో బయలుదేరి అమెరికాకువచ్చి స్పెయిన్ "దేశీయులు కావుర మున్నచోటుల ప్రవేశించి స్పెయిసువారి నందరిని ఖైదీలుగా పట్టుకొని స్పెస్ దేశీయులని గాక "ద్రోహులు బందిపోటు దొంగలు హంతకులున"ని యురిదీసెను. స్పయిన్ దేశీయులు 1665 వ సంవత్సరమున అమెరికా సంయుక్తకరాష్ట్రము లలో నేర్పరచుకొనిన ఈ సెంటు ఆగస్టయిను' అను ప్రాతనివాసము మాత్రమే మిగిలెను.

(2)

{వర్జీనియా}

అమెరికాసంయుక్త రాష్ట్రములలో ప్రధమమున వలసస్థాపింపబడినది వర్జీనియా రాష్ట్రములోనే పరాసుహ్యుజినాట్లు కారొలీనాలో వలస నేర్పఱచుకొనుటకు చేసిన ప్రయత్నము లాంగ్లేయుల నిచటకు వచ్చుటకు పురికొల్పెను. ఆంగ్లేయుడగు సర్ వాల్టరు రాలి' 1585 వ సంవత్సరమున నాంగ్లేయ రాజునుండి దానశాసనమును పొంది యుత్తర కారొలినా పొంతమున నొక యాంగ్లేయులవలస నేర్పఱచెను. కొలదికాలములో నీ యాంగ్లేయు లకారణముగ నొక యెర్రయిండి యనుప్రభువును నతని యనుచరులను వధిం.చిరి. ఇంతటితో నెర్రయిండియును లాంగ్లేయులపై మత్సరమును బూని పెక్కువిధముల పీడింపజొచ్చినందున మరుసటిసంవత్సర మాంగ్లేయులు లేచిపోయిరి. తిరిగి 1587 సంవత్సరమున మరికొంద రాంగ్లేయు లా ప్రాంతమునకే వచ్చి నివసించిరి.' కాని వారిని ఎయిడియనులు నాశనము చేసిరి. 1606 వ సంవత్సరమున అమెరికాఖండమున వలసలను స్థాపించుటకుగాను