పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

295

పదమూడవ అధ్యాయము


న్యాయస్థానములో ముగ్గురు దేశీయ న్యాయాధిపతులును నలుగురు అమెరికను న్యాయాధిపతులును నియమించబడిరి. గవర్నరు జనరలు యొక్క కార్యనిర్వాహక వర్గములో నలు గురు దేశీయులను అయిదుగురు అమెరికసులును నియమింపబడిరి. 1914 సంవత్సరములో విల్సన్ సభాపతి కార్యనిర్వా హక వర్గమునకు ఎక్కువమంది. దేశీయులను నియమించెను. తిరిగి 1916 వ సంవత్సరములో స్వరాజ్యములో నెళ్కువభాగమిచ్చుచు మరియొక చట్టము చేయబడినది. దానికి జోస్సు చట్టమని పేరు. ఆది ఇప్పుడు అమలులో నున్న చట్టము, దానియు పోద్ఘాతము సందిట్లున్నది.:--సంయుక్త రాష్ట్రములు ప్రధమమున స్పెయిన్ తో పోరాడిన యుద్దేశ్యము రాజ్యము సంపాదించవలెనను కోరికతో గానేకారు. కాపు నను ఫిలిప్పైన్ ద్వీపములలో స్థిరమగు ప్రభుత్వ మేర్పడగనే తమ అధికార మున పదులుకొని యాద్వీపముల స్వతంత్రమును అంగీకరిం చుటయే ఎప్పుడును 'సంయుక్త రాష్ట్రముల యు దేశ్యము గసుకను; సదరు ఉద్దేశ్యము నెర వేరుటకును సంపూర్ణ స్వతంత్రము లభించినపుడు దాని జవాబుదారిని హరులను బాగుగా అనుభవించుటకు తయారగుటకుగాను ఫిలిప్పైన్ ద్వీపవాసులకెక్కువ స్వపరి పాల నమిచ్చుట ఆవశ్యకము. గావునను జోస్సచట్ట ప్రకారము క్రైస్తవులు కావురమున్నను లేకున్నను దేశమంతను శాసన సభ లక్రిందికి తేబడెను. రెండు శాసన సభ లేర్పడెను. మొదటిది పూజ ప్రతినిధి సభ. రెండవది శిష్టసభ, రెండును ,ప్రజలచే పూర్తిగ నెన్నుకొవబడినది. నాణెములు, కాగితపు ద్రవ్యము, విదేశీయులను రానిచ్చుట