పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

అమెరికా సంయుక్త రాష్ట్రములు



ఆందోళనము చేయు కక్షియున్నది. కావున ప్రధమముననే ఆమెరికావారు ఫిలిప్సైన్ ద్వీపము లను పరిపాలించుచున్న కారణము, " సంయుక్త రాష్ట్రముల లాభముకొరకు కాదనియు ఫిలిప్పైన్ ద్వీప వాసుల లాభము కొరకు వారిని స్వరాజ్యమునకు అర్హులుగా తరిఫీయతు చేయుటకు మాత్రమే సనియు” ప్రకటించి యున్నారు. అమెరికా తనవాఁగ్దత్త మును కొంతవరకు చెల్లించు కొనుచున్నది. అమెరికా, కిందికి వచ్చినప్పటి నుండియ. ఫిలి ప్పైన్ ప్రజలలో విద్య బాగుగా వ్యాపింప జేసియున్నారు. 1912 సంవత్సరము నుండి 1918 సంవత్సరములో బ్రిటిషు హిందూదేశములో విద్యార్థుల సంఖ్య నూటికి అయిదనంతున వృద్ది చెందినది. ఫిలిప్పైన్ దీవులలో నూటికి నలుదియొక్కటి చొప్పున వృద్ధి అయినది. పరిశ్రమలను విశేషముగ వృద్ధిచేసి నారు. పారిశ్రామిక వ్యవసాయిక పాఠశాలలను విరివిగా నెలకొలిపినారు. స్థానిక స్వపరిపాలను మంచి పద్దతులమీద స్థాపించినారు. 1900 సంవత్సరములో ఒక గవర్నరు జనరలును పిలిప్పినోకమిషన్ అనుకార్య నిర్వాహకవర్గమును రెండు శాసనసభలను ఏర్పాటు చేసిరి. మొదటి దానిలో పూర్తిగా ప్రజల చేసెన్ను కొనబడుసభ్యులందరి. గవర్న రుజసరలు యొక్క కార్యనిర్వాహక వర్గ మీ రెండప శాసన సభగా ఏర్పడినది. . వీరందరిని అమెరికా అధ్యక్షుడు నియమించెను."క్రైస్తవులు కాపురమున్న రాష్ట్రములకన్నిటికిని శాసన సభలు శాసనములను చేయుచుండెను.

క్రైస్తపులుకొని 'మోటజాతులవా రున్న ప్రదేశములను గవర్నరు జనరలే కార్యనిరాహకవర ' సహాయముచే పాలించెను తనకు