పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

293

పదమూడావ అధ్యాయము


సంయుక్త రాష్ట్రములు వారి సహాయమును కోరిరి. సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వమువారు. స్సైన్ తో పోరాడి స్పైస్ నోడించి ఈద్వీపములను స్వాధీనమును పొందిరి. గాని ఈద్వీ పవాసులు కోరినది. స్వతంత్రముగాని సంయుక్త రాష్ట్రముల పాలసము కాదు. అందువలన ఆగుయవల్తో యను దేశీయ నాయకుని నాయకత్వము కింద స్వతంత్రమునకై సంయుక్త రాష్ట్ర ములతో పోరాడిరి. 2 సంవత్సరములు పోరు తీవ్రముగా జరిగెను.ఆ స్వతంత్ర పోరాట ములో ఫిలీ పైన్ ద్వీపవాసులు చాలు మందిహతు లైరి. వారి, గ్రామ ములలను అమరికనులు నాశనము చేసిరి. పిల్లలను స్త్రీలనుకూడ నరికి వేసిరి. అమెరికనులకు జయము గలిగెను. అమెరికా సంయుక్త రాష్ట్రములకు ఫిలిప్పీన్ స్పైన్ ద్వీపములు పూర్తిగ స్వాధీనమయినవి. "


1900 సంవత్సరము వరకును ఆద్వీపములను అమెరికా వారి సైనిక ప్రభుత్వమే పాలించెను. 1900 నుండియు ఫీలి స్పైన ద్వీపములలో సైనిక ప్రభు త్వము తీసి వేయబడి స్వపరి పొలనా విధానమును అమెరికా వారు సృద్దిచే యుచున్నారు. తిరుగబాటులు చల్లారి నప్పటికిని ఫిలిప్పైన్ ద్వీపవాసులలో అమిరికా వారు గానీ మన దేశమునకు గాని లోబడి యుండకూడదను సంపూర్ణ స్వతంతేచ్ఛ ప్రజ్వరిల్లుచు నేయున్నది. ఇపుడది శాంతియుతమగు ఆందోళశమున మారినది. త్వరగ సంపూర్ణ స్వతంత్రము ప్రసాదించవలెనని అమెరికా వారిని స్వతంత్ర వాదులు కోరుచున్నారు. అమరికాలో ఫిలిప్పైన్ ద్వీపములను స్వాధీనమును పొందుటయే అక్రమనియు వాటికి వెంటనే సంపూర్ణస్వతంత్రము నిచ్చి లేచి రావలసిన దనియు