పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

291

పదమూడవ అఖ్యాయము



సంయుక్త రాష్ట్రము లక్రింద చేర్చుకొనిరి. ఆ ద్వీపవాసులకు ఆమెక నులతో పాటు పౌర స్వత్వముల నిచ్చియున్నారు.. ఆద్వీపములు పసిఫికు మహా సముద్రమునకు తాళము చెవివలె సున్నవి. అచట అమెరికావారి నౌకాదళ ముంచబడుచున్నది. పసిఫికు మహా సముద్రము యొక్క వుత్తర ప్రాంతమున జరుగు వర్తక వ్యాపారమునకవి మిక్కిలి యుపయోగకారిగా సున్నవి.వానినుండి వుత్తర దక్షిణ అమెరికా ఖడములను రెంటిని సంరక్షించు కొనుటకు వీలగును. గ్యూఅం ద్వీపమును 1838 సంవత్సరమున స్పైన్ వారితో జరిగిన యుద్ధములో సంపాదించిరి. టాట్యులా, రోజు, ద్వీపములను ఫిలిప్పైన్ దీపములనుకూడ సంపాదించిరి. వీటి వలన పసిఫికు మహా సముదములో, వర్తపు త్రోవలపై యాజమాన్యము వహించుటయేగాకి సంయుక్త రాష్ట్రములనౌకాదళము లుండుటకుకూడ మంచి తావులు దొరికినవి. 1914 సంవత్సరములో పనమా జలసంధి వరకు గొప్ప కాలువను తవ్వట వలన అమెరికా యొక్క పర్తకాభివృద్ధికి మంచి వీలుకలిగినది. పసిఫిక్కు మహాసముద్రముగుండపచ్చి 'అమెరికా నరకులు చీనా రాజ్యములో విశేషముగ అమ్ముడు వోవుచున్నవి. హిందూదేశ మునకుగూడ బాగుగా పర్చువచ్చున్నవి. అట్లాంటిక్ మహా సముద్రములోని క్యూబా దీపము స్పెయిన్ వారి క్రింద నుండెను. దానిని తము కమ్మవలసినదని స్పెయిన్ వారు సంయుక్త రాష్ట్ర ముల' ప్రభుత్వమువారు గోరిరి. కాని స్పెయిన్ ప్రభుత్వమువారు నిరాకరించిరి. 1895 మొదలు 1998 వరకు క్యూబాలోని పజలు స్పెయ్యి ప్రభుత్వముపై తిరుగుబాటులు చేయు