పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

అమెరిక్క్ సంయుక్త రాష్ట్రములు


చుండుటయు స్పెయిన్ వారు రూరముగా అణచుచుండుటయు జరిగెను. తిరుగ బాటుదార్లకు సహాయము చేయుటకు 1888 : సంవత్సరములో సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వమువారు విశ్చయించి స్పెయి న్ పై యుద్ధమును ప్రకటించిరి. జరిగిన యుద్దములో స్పెయిన్ పూర్తిగ నోడిపోయి సంధిని కోరెను.. తముక్రింద నుండిన క్యూబా, పోర్టోరీకో”, గూఆం, ఫిలిప్పైన్ ద్వీపములను సంయుక్త రాష్ట్రముల కిచ్చి స్పెయిన్ వారు" రాజీపడిరి. క్యూబాలో సంపూర్ణమగు ప్రజాస్వామ్యమును స్థాపించి యచట సంయుక్త రాష్ట్రములకు కొన్ని వర్తపు హక్కు లుండునట్లును, క్యూబాను విదేశీయులనుండి... సం యుక్త రాష్ట్ర ప్రభుత్వము కాపాడు నట్లును యేర్పాటు గావించిరి. ఇక ఫిల్పిన్ ద్వీపముల కు పత్తము. ..

ఫిలిప్పైన్ ద్వీపములు.

ఫిలిప్పైన్ ద్వీపములు అసియా ఖండములోనివి. పసిఫిక్కు మహాసముద్రములో జపాసుకు దక్షిణ మున నున్నవి. వీటి వెళాల్యము 87858 చదరపు మైళ్లు అనగా దాదాపుగా మదరాసు రాజధాని యంత వైశాల్యము గలవిగా జనసంఖ్య 10 లక్షలు .. అనగా గంజం, విశాఖపట్టణము , గోదావరి, కృష్ణాజిల్లాలు కలిసిన జనసంఖ్య తోసమానముగా మా త్రముండును. ఈద్వీపవాసులు ఆసి యాఖండవాసులయినను విశేషనాగరీకులు గారు. ఈద్వీపములు చాలకాలము స్పెస్ వారి క్రింద నుండెను. ప్రజలు చాలవరకు క్రైస్తవ మతమును స్వీకరించిరి. కొంతవరకు స్పైస్ భాషను చేర్చుకొని. 1893 వ సంవత్సరమున స్వతంత్రమును పొందుటకు ఫిలిప్పైన్ ప్రజలు స్పైన్ ప్రభుత్వము పై తిరుగబడిరి.