పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290

అమెరికా సంయుక్త రాష్ట్రములు


రాజ్య
సంపాదనము.


పసిఫికు మహాసముద్రములో యూజమాన్యమువహించ వలెనని సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వము రాజ్య సంపాదనము. వారు ప్రయత్నించుచున్నారు. ' జపాను, చైనా, రుష్యాలు ఆ మహాసముద్రము యొక్క ముఖ్య రాజ్యములు, చైనా, రష్యాలు సంయుక్త రాష్ట్రములతో పోటీకి రాలేవు జపాను మాత్రము బలవంతమైనదై సంయుక్త రాష్ట్రములకు పోటీగ నున్నది. జపానువారు చైనానుమ్రింగి అధిక బలవంతులుగాకుండా సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వము వారు. చైనా యొక్క స్వతంత్రమునకు అండగా నిలువబడి నారు. యూరపు ప్రభుత్వము లెవరును పసిఫికు మహాసముద్రములో కొత్తగా బలవంతమైన స్థానము లేర్పరచుకొన కుండ జపాను, సంయుక్త రాష్ట్రములు చూచుచున్నవి. ఇంగ్లాండునకు అచట ఆస్ట్రేలియా గలదు. ఇంగ్లాండు ఇటు జపొసుతోసు అటు సంయుక్తరాష్ట్రములతోను సంధిచేసు కొని జాగ్రత్తగ వచ్చుచున్నది, ఇరువది సంవత్సరముల కాలములో పసిఫికు మహాసముద్రములోని కొన్ని ముఖ్యమగు ద్వీపములను సంయుక్త రాష్ట్రములు సంపాదించినవి.


1867 వ సంవత్సరము న అలాస్కాను రుష్యా ప్రభుత్వ మునుండి సుయుక్త రాష్ట్రములు కొనినది. దానిలో నిపుడు మేలై నబంగారమును విశేషముగా నేలబొగ్గును దొరకు చున్నవి. అలాస్కాకు సమీపముననున్న హవాయిద్వీవ ములలో మొదట మతబోధకులగను తరువాత వర్తకులుగను కాఫీతోటల వ్యవసాయకులుగను ప్రవేశించి అచట జరిగిన నొక తిరుగుబా నవకాశము తీసుకొని యాద్వీపములను