పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

289

పదమూడవ అధ్యాయము


అమెరికనులకిందనే ఉండవలెను " ఆస భావమును సంయుక్త రాష్ట్రములు ప్రోత్సహించుచున్నవి. సంయుక్త రాష్ట్ర స్వతంత్రమను ప్రకటించినతరువాత సూరు సంవత్సరములు నిండిన తేదీన ఉత్సవము జరిపినపుడు అమెరికాఖండములోని అన్ని దేశముల ప్రతినిధులను రావించి అమెరికా "ఖండము అమెరికా వాసులది అను తీర్మానములను చేసి యున్నారు. కెనడా దేశము ఇంగ్లీషు వారికిని గ్వైనాదేశము ఇంగ్లీషువారికినిఫ్రెంచివారికిని,డచ్చి వారికి లోబడియున్నది. ఈ రెండు దేశ సులు తప్ప ఉత్తర దక్షిణ అమెరికా ఖండము లోని తక్కిన అన్ని దేశ మలును స్పైన్ మొదలగు యూరపు ప్రభుత్వములపై తిరుగ బడి స్వతంత మును పొంది సంపూర్ణ ప్రజాస్వామ్యములై విల సిల్లుచున్నవి గానీ 1914వ సంవత్సరము: 'మొదలు 1919 వరకు జగిన ప్రపంచయుద్దము లో మాతము సంయుక్త రాష్ట్రములు జోక్యము. కలగచేసుకొని జనులకు వ్యతిరేకముగా మిత్ర్తమండలి వారికి సహాయము చేసియున్నారు. మానవకోటికి స్వాతంత్యము అన్ని జాతులకును స్వయంనిర్ణయము మొదలగు గొప్ప ఆదర్శములతో అమెరికా అధ్యక్షుడగు విల్సన్ మహాశయుడు ఆ యుద్ధము లోనికి దిగి సుప్రసిద్ధ మగు పదునాలుగు సూత్ర ములను ప్రతిపాదించెను . కాని ఆంగ్లేయ ప్రధానమంత్రి యగు లాయడు జార్జి, పరాసు ప్రధానమంత్రి క్లిమెన్ షో, ఇటలీ ప్రధానమంత్రి ఆర్లెండో వీరి ఆలోచనలకు లోబడి విల్సన్ సభాపతి తనయుత్కృష్ట స్థానమును గోల్పోయెసు. విల్సన్ సభాపతి యొక్క పదునాలుగు సూత్రములును మంటగలిసెను.