పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదమూడవ అధ్యాయము

283


న్యూయార్కులో సున్నట్టియు, న్యూయార్కుకు కొత్తగా ఏటట దిగునట్టియు బీదలగు పిల్లల కందరకును అన్న వస్త్రము లిచ్చి విద్యార్ధివసతిగృహములలో నుంచి జీతము లేకుండ ప్రైమరీ, ఉత్తమపారిశ్రామిక విద్య నేర్చుటకు తగిన ప్రతిష్టాపనలు న్యూయార్కు పట్టణమున లెక్క లేనిన్నిగలవు. ధనవంతులు చేయ సహాయమువలన ఈ ఏర్పాటులు జరుగుచున్నవి. అచట నాపిల్ల లాంగ్లేయభాషను వారి స్వభావను ప్రకృతి శాస్త్రమును అమెరికా దేశ చరిత్రమును చదివి తాము పెంపకము నకు వచ్చిన అమెరికా సంయుక్త రాష్ట్రము లందు . అత్యంత దేశాభమాసమును గర్వమును నేర్చుకొందురు. పిల్లల ఆరోగ్యము నరయ టకు వైద్యులు మంత్రసానులు గలరు. పిల్లలు ఆడుకొనుటకు ఆటస్థలములును చదువుకొనుటకు గ్రంథాలయ ములునుగలపు. బీదల యిండ్లను దర్శించి తల్లులకు శిశుపోషణ సుగూర్చి సలహానిచ్చుటకును వైద్య సహాయము చేయుటకును తిరుగుచుండు నైద్యులును మంత్రసానాలను చాలమంది ఏర్పడి యన్నారు. కోటీశ్వరులగు వారిలో చాలమంది తమధనము తమదేళమునకు వినియోగపడవ లెనను దేశాభిమానము కలిగి యుండుట వలననే ఇంక పని జరుగుచున్నది. శార్నీ జీ అను కోటీశ్వరుడు గ్రంధాలయను లకును విద్యాలయములకును ఎంతో దానధర్మములు చేయుచున్నాడు. ఇంతవరకు ఏబది “ఆరుకోట్ల రూప్యముల ధనమును దానధర్మములకు వెచ్చించి యన్నాడు. ఇంకను ధనము తరుగుట లేదు. మాకాలను కోటీశ్వరుడు చిత్తరువులకును కళలకును శిల్పములకును ఎక్టున సహాయము చేయుచున్నాడు. . రాడు ఫెల్లరు ప్రకృతిశాస్త్ర