పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

అమెరికా సంయుక్త రాష్ట్రములు



పోవుటకును క్రిందికి దిగుటకును' విద్యుచ్చక్తివలన లాగబడు బల్లలుండును. బొంబాయ నగరమును చూచినవారు ఇట్టి బల్లలను చూచి యుందురు. ఈగట్టడముల వైభవము వర్ణింప నలవికాదు.

కోటీశ్వరులు

ఇంతేగాక అమెరికాలో సున్న కోటీశ్వరులు మరియెక్కడను లేరు. ఏమియు ద్రవ్యము లేకుండ అమెరికాకుపోయి తమ తెలివి తేటలవలన కోటీశ్వరులై నవారు పెక్కు మందిగలరు. రాకు ఫెల్లరు, కాగ్నిజీ వీరు పొంటు మార్గసు ఫోర్డు మొదలగువారు బహు సామాన్య స్థితినుండి కోటీశ్వరులైనవారు. న్యూయార్కులో నా నాకోటీశ్వరుల బజారు గలదు. {Millionaires avenue) ఆ బజారులలోని కట్టడముల వైభవము సొగసు అందులోని ఐశ్వ ర్వవము ఎవరు వర్ణించగలను! నిమిషమునకు ఎన్ని వేల సవర మల ఆదాయ మవచ్చునో చెప్పవీలు లేని కోటీశ్వరులు గలరు. ఈ కోటీశ్వరులు సంయుక్త రాష్ట్రములలోని విద్యావిష యిక వరిపాపనలకును, ప్రకృతి శాస్త్ర శోధనలకును, గ్రంధా లయములకును, వైద్యాలయములకుసు, విశేషముగ సహా యము చేయుచున్నారు. సంయుక్త రాష్ట్రములలో ప్రతి రాష్ట్రములోను నొక విశ్వవిద్యాలయము ప్రభుత్వమువారిచే పాపింపబడియున్నది. ఇవిగాక ధనవంతులు స్థాపించిన విశ్వ విద్యాలయములు, కళాశాలలు, పాఠశాలలు లెక్కలేనన్ని గలవు. యూరపుఖండము నుండి ప్రతి ఏటను లక్షలు బీదలగు. తెల్లవారు అమెరికాకు వలస పోవుదురు. వారు ప్రధమమున న్యూమూర్కు , సగరమున దిగుదురు,