పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

ఆమెరికా సంయుక్త రాష్ట్రములు


శోధనలకును విశ్వవిద్యాలయములకును లెక్క లేనిసొమ్ము వెచ్చించుచున్నాడు. ఫోర్డు అనువాడు మోటారుకార్ల యజ మాని. ఫోర్డు కారు అనునది అతను కనిపెట్టిన కారు. హిం దూదేశములోను మరి ఇతర దేశములోను క్రైస్తవమతబోధ సల్పు తెల్లపాదిరీలకు (బోధకులకు) తలావక ఫోర్డుకారు ఉచితముగా నిచ్చుచున్నాడట ! అమెరికాలో మోటారుకార్లు చాల చవుక , మరియు వాటిని పెట్టుకోగలవారును విశేషముగాగలరు. అచటి కార్మికులలో చాలమందికి స్వంత మోటారు కార్లుండును. వాటిలోనే ఎక్కి కూలిపనిచేసు కొనుటకు పోయివచ్చెదరు. మన దేశములో కార్మికులకు వంటెద్దు బండ్లు ఉన్నట్టులనే అచట, మోటారు కార్లుండును. మన దేశమునకును ఆదేశమునకును ఐశ్వర్యములోకూడ అంతే భేదము .

నవనాగరికత.


సంయుక్త రాష్ట్రములు నవీనమగు దేశము. ప్రతిసంవత్సరము సగుటున పదిలక్షలకు తక్కువగా కుండ యూరఫు ఖండమునుండి తెల్లవారు ఇచ్చటికి కాపురమునకు వచ్చుచున్నారు. ప్రధమములో యూరపుయొక్క, పశ్చిమభాగమునుండి అనగా యింగ్లాండు,ఫ్రాన్సు, ఐర్లండు, జర్మనీ, స్పైస్ , హాలెండు దేశ ములుండి పలస వచ్చిరి. కానీ రానురాను ఆ దేశము లనుండి ప్రజలువలన వచ్చుట చాల తక్కువయింది. యూరపు ఖండపు, తూర్పు దేశములగు రొమేనియా, బాల్కను రాష్ట్రమలు, రుష్యా, టర్కీ, ఆర్శినిము, ఆస్ట్రియా మొదలగు దేశములనుండి నచ్చు చున్నారు రాచకీయ నిర్బంధములకును మత నిర్భంధముల