పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదమూడవ అధ్యాయము

281



కొరకును, ఇతర విధములగు అభివృద్ధికగారకును వినియోగించుట తోను సంయుక్త రాష్ట్రములు ప్రసిద్ది చెందియున్నవి. ప్రవాహము లన్నిటినుండియు విద్యుచ్చక్తి ఉత్పత్తిచేయబడు చున్నది. అమెరికసులు పతిపనికిని విద్యచ్చక్తిని వినియోగించుకున్నారు. సంయుక్త రాష్ట్రములలో వాడినంత విద్యుచ్ఛక్తి మరొకదేశ ములో వాడుట లేదని చెప్పవచ్చును. .

నగరవై
భవము.


సంయుక్త రాష్ట్రములలో నగరములు పట్టణములు విశేషముగ వృద్ధిచెందినవి. ప్రధాన నగర రాజము న్యూయార్కు. ఇది తూర్పసముద్ర తీరమున నొక ద్వీపముమీద కట్టబడినది. దీని జనసంఖ్య అరువది లక్షలు కలిగి ప్రపంచములో మొదటిదిగ నున్నది. ఇంగ్లాండు యొక్క రాజధానియగు లండ నునగరము: సందే బదిలక్షలు జనులు గలరు. అమెరికాలో న్యూయార్కుతరువాత ప్రధాన నగరములు చికాగో, ఫిలడల్ఫియా సగర ముల. న్యూయార్కులో ,పపంచములో కెల్ల ఎత్తైనకట్టడములు గలవు. 'ఆనగరములోని బ్రాడ్వే అను వీథిలో పది అంతస్తులకు తక్కువ మేడ లేదు. నలుబది అంతస్తులకు మేడలు గలవు. ఆగరముయొక్క స్కై లైనవీధిలో మ్యునిసిపలు కచ్చేరి ముప్పదినాలుగంతస్తులు గలగి. సింగరు, (బట్టలు కుట్టు యంత ముల) కంపెనీ యొక్క కట్టడములు బది అంతస్తులు గలది. వులువర్తు కట్టడము ఏబడి అయిదు అంగస్తుల గలది. ' . ఇట్టి యెత్తయిన కట్టడము లెన్నయో గలవు. సలుబదినాలు గంతస్తులు గల యొక (హోటలు), పూటకూళ్ళ బస గలదు. ఈ కట్టడముల లోని ఏఅంతస్తు కైన