పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

అమెరికాసంయుక్త రాష్ట్రములు


. సగము ఇంగ్లాండు మొదలగు యూరపుఖండములోని దేశములకు రవాణా యగుచున్నది. హిందూదేశములోని ప్రత్తికన్న అమెరికా ప్రత్తి శేషమైనది. సంయుక్త రాష్ట్రములు, హిందూ దేశము, ఈజిప్టు ఈ మూడు దేశములనుండియే యూరపియస్ జూతులు తమ బట్టలయం త్రశాలలకు శావలసిన దూదిని తెప్పించుకొనుచున్నారు. ఈ దేశములనుండి దూదిరానిచో యూరపులోని యంత్రశాలలు మూయబడును. రాష్ట్రము

లలో ఇనుము, రాగి, వెండి, అల్యూమినం మొదలగు లోహ ములే గాక, కాలిఫోర్నియా, గోలొరాడో మొదలగు రాష్ట్ర ములలోను, అలాస్కాలోను బంగారు గనులు త్రవ్వబడి మేలైన బంగారము చాల దొరకుచున్నది. ప్రపంచములోని అన్ని దేశములతోను రాకపోకలు పూర్తిగా మాని నను సంయుక్త రాష్ట్రముల ప్రజల ఆహారము కును, బట్టలు మొదలగు పారిశ్రామిక సరుకుల కును కొదువ లేకుండ స్వయం సహాయము మీద నిలువగలరు. సంయుక్త రాష్ట్రములలోగల అన్ని సౌకర్యము లును హిందూదేశములోన గలవు. రెండువందల సంవత్సరములకు ముందు హిందూదేశము గొప్పపారిశ్రామిక దేశముగను, వ్యవసాయ దేశము: గనుకూడ ప్రసిద్ది చెంది దేనికిని ఇతర దేశములమీద ఆధారపడని స్థితి యందుండెను, కాని ఇపుడు హిందూదేశములో పరిశ్రమలన్నియు క్షీణించి కేవలము వ్యవసాయిక దేశ మైనదీ, కట్టుకొను బట్టలకును, వ్రాసుకొను కాగితములకును పొయిరాజేయు నిప్పుపుల్ల కును ఇతర దేశముల మీద హిందూదేశ మిపుడా ధారపడియున్నది. ప్రకృతి శాస్త్ర శోధనలలోను శోధనా ఫలితములను వదిశ్ర మల,