పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదకొండవ అధ్యాయము

241



లోవలే అంత చిన్న స్తలములో అంతవి శేషమగుదౌర్భాగ్యము మరి యెచటను నింపబడియుండ లేదు " సర్ విలియం డోల్యను వ్రాసినట్లు నీగ్రోలను ఒక అడుగున్నర యెడయెడముగ యుడుగు భాగమున నాపడవలలో వరుసగ నందరి కలిపి పరుండ బెట్టి వారిచేతులను పాదములనుకట్టి వేసి పొడుగాటి యినుపగొలుసులచే బంధించిరి. వారావిధముగ షుమారు తొమ్మిదివారములు గాలిచొరనట్టియు యిరుకై నట్టియుఅనారోగ్యకరమైనట్టియు నాపడవలలో యడుగుభాగమున ప్రయాణము చేయుచు మిగుల దుష్టమగు అంటువ్యాధులకు లోనైరి. వారి శరీరములు కుళ్లుచుండెను. అప్పుడప్పుడు వారిని పరీక్ష చేయుటకు వచ్చిన వారు చనిపోయిన వారి శవములను ఆవరుసలోనుండి గొలుసులూడ దీసి యెత్తి పారవేయుచుండిరి. అట్లు ఎత్తిపారవేయు వరకును రోజులకొలది కుళ్ళి వాసనకొట్టుచున్నను ఆశవములు బ్రతికి యున్నవారి పక్కన వారితో కలిపి బంధింపబడియే యుండెను. ఆఫ్రికాలో పట్టుకొనబడిన బానిసలలో సగము మంది మాత్రమే అమెరికాలోని దుకాణములలో అమ్మ బడుటకు అర్హులుగా జీవించి యుండిరి.

బానిసల
దౌర్భాగ్య
స్థితి.

పంతొమ్మిదవ శతాబ్దప్రారంభము నకు (బ్రెజీలు లోఇరువదిలక్షల బానిసలును అమెరికా సంయుక్త రాష్ట్రములలో తొమ్మిదిలక్షల బానిసలును ఇంగ్లాండు యొక్క పాలసము క్రిందనుండిన తక్కిన వలసరాజ్యము లన్నిటిలోను ఎనిమిదిలక్షలమంది బాననలును , స్పైన్ పోర్చుగలు రాజ్యముల వలస దేశములలో ఆరు