పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

అమెరికా సంయుక్త రాష్ట్రములు


లలోగల నలుబది గిడ్డంగులలో పదునాలుగు ఆంగ్లేయులవి పదునేను వచ్చివారివి మూడుపరాసులవి నాలగుగుపోర్సుగీసు వారివి నాలుగు డేనులవి. 1790 వ సంవత్సరమున ఆంగ్లోయులు రవానాచేసిన నీగ్రోబానిసల సంఖ్య ముప్పది ఎనిమిది వేలు. పరానువారు చేసినవారు ఇరువది వేలు. డచ్చి వారు. చేసినదినాలుగువేలు. డేసులు ఎగుమతి చేసినది రెండు వేలు. పోర్సు గీసువారు ఎగుమతి చేసిన సంఖ్య పదివేలయ్యుండెను. బానిసత్వపు చరితనువ్రాసిన గ్రంధకర్త ఇటుల వ్రాసియున్నాడు. ఉత్తరాఅప్రికా తుర్కీ మొదలగు దేశములలోని మహమ్మదీయుల కొరకు బానిసలను అమ్ముపద్దతి అదివరకుగూడ కొంతవరకుగలదు, కాని తెల్లజాతులవారిమితిలేని దురాశ వలనను దుండగులవలనను మానవులను వేటాడిదొంగిలించి బానిసలగచేయు పద్దతి అతి విశేషముగ వృద్ధి చెందినది. వీరుతరుచుగా రాతివేళ గ్రామములపై బడి తగులబెట్టి పారిపోవుచున్న నల్లవారిని స్త్రీలను పురుషులను పిల్లలను పట్టుకొని బానిసలుగ చేయుచుండిరి ఎదిరించిన వారిని తుపాకులతో కాల్చి చంపుచుండిరి. మోసకృత్యములకు మేరయేలేదు. రాక్షసస్వభావము సంపూర్ణముగ ప్రదర్శింపబడెను. " తెల్లవారవలంబించిన క్రైస్తవ మతమునకును వారుచేయుచున్న అమానుష కృత్యముల కును సంబధము లేకుండెను. "అట్లు బానిసలుగా పట్టుకోనబడిన వారు సముద్రతీరములోని గిడ్డంగుల వరకుము అటుతరువాత సముద్రముల మీద పడవలలో అమెరికా ఖండమునకును తీసుకొనిపోబడుటలో పొందిన బాధలు వర్ణనాతీతము, వారు తీసికొనపోబడిన పడవలు నరకకూపములు. బానిసల పడవలు