పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదకొండా ఆధ్యాయము

239


బిరుదముల నొసంగెను. ఈయన చేయుచున్న గౌరవనీయ మైన వ్యాపారములో రాణికికూడ భాగముండెను.


తరువాత రాజులుగవచ్చిన మొదటి జేస్సు మొదటిఛార్లెసు రెండవఛార్లెసు రాజుల కాలమున ఆంగ్లేయ దేశములోని వాని సవ్యాపారులు విశేషముగ ప్రోత్సాహము పొందిరి. రాణ “బంధువుడగు యూర్కు ప్రభువు బానిస ప్యొపార సంఘమున కధ్యక్షుడుగ నుండెను. కొంతకాలము వరకు నీగ్రో బానిస వ్యాపొరము కొన్ని పత్యేక సంఘముల చేతులలో నండెను. గాని విలియం రాజు సంఘముల ప్రత్యేకహక్కులురద్దు పరచి ఆంగ్లోయులందరును నీగ్రోబానిస వ్యాపారసు చేయవచ్చునని శాసించెను. ఆంగ్లేయు వ్యాపారులు ప్రతిసంవత్సరమును ఆఫ్రికాలోని నీగ్రో బానిసలను వేలకు వేలుగ పట్టుకొనుచుండెడివారు అమెరికాలో ఆంగ్లేయ వలసరాజ్యములలోనికి 1680 మొదలు 1726 సంవత్సరము వరకు దిగుమతి అయిన నీగ్రోబానిస లసంఖ్య ఇరువది ఇరువది లక్షల ముప్పది వేలు. 1718 సంవత్సరమున ఉట్రెక్టువద్ద ఇంగ్లాంను సకును స్పైన్ కుసు జరిగిన సంధిలో పతిఏటను పశ్చిమ యిండియా ద్వీపములలోని 'స్పైన్ వారికి ఆంగేయుప్రభుత్వము వారు నాలుగు వేల ఎమిది వందలమంది నీగ్రో బానిసల చొప్పున ముప్పదిసంవత్సరములకాలము తెచ్చి యిచ్చి నట్లును కొంతసొమ్మును స్పైస్ వారు ఆంగ్లేయులకిచ్చు నట్లును ఒకంబడిక చేసుకొనిరి. ఒక్క ఆగ్లేయులేగాక యూరపు జాతుల వారుందరును నీగ్రోబానిస వ్యాపారమును చేయుచుండిరి. ఇందుకొరకై ఆఫికా ఖండతీకములలో గిడ్డంగులను (factories) కట్టుకొనిరి. 1791 వ సంవత్సరముస ఆఫ్రికాతీరము