పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

అమెరికా సంయుక్త రాష్ట్రములు



లక్షల బాసినలును ఫ్రాన్సుయెక్క వలసరాజ్యములలో రెండులక్షల ఏబది వేలమంది బానిసలంను ఉండిరి. బానిసలు పారిపోకుండ కఠినమగు చట్టములు చేయబడెను. సౌకర్యములు చేయబడెను. బానిసలకు ఆస్తియుండ నేరదు. బానిసలకు ఆత్మలు లేవనియు వారు యజమానుల లాభముకొరకు పుట్టినారనియు తెల్లవారు నమ్మిరి. బాని సలు న్యాయస్థానములలో సౌక్ష్యమిచ్చుటకు అర్హులు కారు. బానిసలు యజమానుల తాలూకు ఆస్తి, కుర్చీలు బల్లలు సొమానులు పశువులవంటి ఆస్తి అయియుండిరి. వారి శారీరమును యజమాను లేమి చేసినను చేయవచ్చును. బానిన స్త్రీలను మానభంగము గావించుట దోషమేకాదు. బానిసల కెంత కఠినశిక్షలు విధించినను వారిచేత ఎట్టికఠినమగు మోయు లేని బరువుగల పనిచేయించినను యజమానులను అడుగువారు లేరు. యజమానుల క్రూరత్వమువలనను యజమానుల నిర్ణయ దురాశ వలనను బానిసలు అతివి శేషముగా పనిచేసి విశేషముగా మరణించుచుండిరి. బానిసలజాతి అమెరికాలో న్వేచ్చగల బాతులవలె వృద్ధినొందుటకు మారుగా క్షీణించుచుండెను. గావున కొత్తబానిసలను ఏటేట వేలకు వేలుగ ఆఫ్రికా నుండి తెప్పించుచుండిరి. ఉత్తర ఆమెకాలో అనేక రాష్ట్రయిలలో బానిసలు చదువుకున్నసు వారికి చదువు చెప్పినను శిక్షలు విధించు చట్టములు చేయబడెను. చదువు చెప్పిన వానికి ఆరునెలల ఖైదు పది హేనువందల రూప్యముల జరిననాము విధించబడు చుండెను. బానినత్వమునకును విద్య