పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

అమెరికా సంయుక్త రాష్ట్రములు


క్రిమిసలు శివిలు కేసులను విచారణ చేయు అధికారము లేదు. సంయుక్త ప్రభుత్వము వారు చేయు చట్టము పైనను రాజ్యంగ విధానమునకు వృతిరేకమగా చేయబడినవని ఏపౌరుడైనను సుప్రీం కోర్టులో (ఉన్నత న్యాయస్థానములో) దావా తెచ్చినచో ఆన్యాయ స్థానము వారు ప్రభుత్వము వారికి తెలియ జేసి ఉభయపక్షములను విచారించి తీర్పు చెప్పదగు చట్టము రాజ్యంగ విధానమునకు వ్యతిరేకముగ చేయబడినట్లు తీర్మానించినచో సది రద్దగును. ప్రభుత్వపు ఉద్యోగస్తులు చేయు చర్యలన్నియు కోర్టులో దావాలమూలకముగ ఆక్షేపించి అక్రమమయినవాటిని రద్దుపర్పించు కొనుటకు అమెరికాలోని పౌరులకు హక్కుగలదు.

<poem>హిందూదేశమున న్యాయవిచారణ శాఖ.<poem>


హిందూదేశమున ఆంగ్లేయ పాలనము కింద ముఖ్యముగా క్రిమినలు న్యాయస్థానములు స్వతంత్రముగ లేవు. జిల్లాలలోని క్రిమినలు న్యాయాధిపతులందరసు జిల్లా కలెక్టరుకు లోబడి యున్నారు. జిల్లా కలెక్టరు కార్య నిర్వాహక శాఖకు చెందిన యుద్యోగ పరంపరలో సతి ముఖ్యమగు స్థానమును వహించియున్నాడు. జిల్లాకలెక్టరుకు జిల్లా మేజ స్ట్రీటుగానున్నారు. జిల్లాలోని రివిన్యూ, అదాయపు పన్ను, ఉప్పుపన్ను, అబకారి, అడవి, పోలీసు, నీటి పారుదల ఇందలగు ప్రభుత్వ ముయొక్క అదాయమునకును ప్రతిష్టకును సంబంధించిన సమస్త శాఖలకును యజమానిగ నున్నాడు. జిల్లాకు మేజిస్ట్రేటుక్రింద క్రిమినలు న్యాయవిచారణను చేయు సబుకలెక్టరులు, డిప్యూటి కలెక్టరులు , తహస్సీలు దారులు, శిరస్తా M