పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

215

తొమ్మిదవ అధ్యాయము

న్యాయ విచారణ
శాఖ.


సంయుక్త రాష్ట్రముల జాతీయ ప్రభుత్వములో మూడవ భాగము న్యాయస్థానములు , పౌరుల స్వతంతములను కాపాడుటకును శాసనములను ధర్మబుద్దితో పోలించుటకును ఏర్పడినవి న్యాయస్థానములు. న్యాయస్థానములలోని న్యాయాధి పతులు న్యాయమూర్తులుగను ధర్మస్వరూపులు గను ఉండ వలెను. లేనిచో ప్రభుత్వము అధర్మ ప్రభుత్వముగ నుండును. గావున స్వతంత్ర దేశములలో న్యాయస్థానములు కార్యనిర్వాహణ శాఖక ( Executive ) లోబడకుండ స్వతంత్రముగ మండునట్లు ఏర్పాటుచేసికొని యున్నారు. అట్టి ఏర్పాటే సంయుక్త రాష్ట్రములలోను గలదు. న్యాయస్థానములును అందలి న్యాయాధిపతులును శాసనసభలకు(కాంగ్రెసు) గాని అధ్యక్షుడు, మంత్రులు, వారి క్రింది యుద్యోగస్తులు మొదలగువారికి గాని లోబడియుండక స్వతంతముగ నున్నారు. సంయుక్త రాష్ట్రములలో ఉన్నత న్యాయస్థానమునకు ( Supreme Court ) సుప్రీం కోర్టు అని పేరు దానికి లోబడి సమస్త శివిలు క్రిమినలు కోర్టులు న్యాయస్థానములు) సుఉన్నవి. సుప్రీంకోర్టు (ఉన్నత న్యాయస్థానము) లో నొక ప్రధానన్యాయధిపతియు ఎనిమిది మంది సహాయన్యాయపతులును గలరు. ఒకసారి ఏర్పడిన తరువాతి న్యాయాధిపతులను కేవలము 'చెడు ప్రవర్తన రుజువైన తప్ప తీసి వేయుటకు వీలు లేదు. డెబ్బది సవత్సత్సరముల వయస్సు వచ్చువరకుసు పనిచేయవచ్చును. అటు పైన ఫింఛన్ (ఉపకార వేతనము )నిచ్చెదరు. రెవిన్యూ పోలీసు మొదలగు ఇతర పనులు చేయు ఉద్యోగస్తులెవరికిని