పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

217

తొమ్మిదవ అధ్యాయము


దారులు కేవలము జిల్లాకలెక్షరుతో పాటు రెవిన్యూ ఉద్యోగస్తులు ప్రతి విషయములోను ఆయా ప్రదేశములలో జిల్లా కలెక్టరుకు లోబడి ప్రభుత్వము యొక్క ప్రతిష్ఠను ఆదాయమును కాపాడ వలసిన వారై యున్నారు. వీరి యుద్యోగములు జీతముల అభివృద్ది కేవలము జిల్లాకలెక్టరు యొక్క అనుగ్రహము మీద ఆధారపడియుండును. "ఇదిగాక జిల్లాలలోగల స్టేషనరీ సబు మేజిస్ట్రీలులు (ప్రత్యేక క్రిమినలు న్యాయాధిపతులు, కూడ చిన్న రవిన్యూ ఉద్యోగముల నుండి జిల్లాక లెక్టరులచే : నియమించ బడి పై యుద్యోగములకును పెద్దజీతములకును జిల్లాకలెక్టరుల ఆగ్రహా నుగ్రహములమీద ఆధారపడియున్నారు. కావున జిల్లాలలోని మిసలు న్యాయస్థానములలో రాజకీయ నేరములలోను పోలీసు, సాస్ట, ఆబుకారి, ఫారెస్టు, మొదలగు ప్రభుత్వపు కేసులలోను నిష్పక్షపాతమగు న్యాయము కలుగునని పౌరులకు విశ్వాసముండదు. ముఖ్యముగా రాజకీయ నేరములలో కలెక్టరుల యభిప్రాయాను సారముగ క్రింది మేజస్ట్రీటులు శిక్షలు విధించుట అనేక చోటుల జగుగుచున్నది. కార్య నిర్వాహ్నశాఖయు క్రిమినలు న్యాయవిచారణా శాఖయు విడదీయుటయు క్రిమినలు న్యాయాధిపతులందరను హైకోర్టు క్రింద సుంచుటయ చాల అవసరమని హైందవ రాజకీయ వేత్తలు ఆందోళనము చేయుచున్నప్పటికిని ఆంగ్లేయ అధి కారవర్గమువారు ఈమార్పుచేయుటకు ఇంతవరకును సమ్మతించుటలేదు. నైజాం రాష్ట్రములో ఘసతవహించిన నైబాంగారు కార్యర్వా హకశాఖను న్యాయవిచార శాఖను పూర్తిగా విడదీసినారు. రివిన్యూ ఉక్యోగస్తులెవరికిని సివిలు, క్రిమినలు అధి కారములు -