పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

అమెరికా సంయుక్త రాష్ట్రములు



ఇంగ్లాండు, ఫ్రాన్సు, స్పైస్, ఇటలీ, జపాను మొదలగు చిన్న దేశ్లములో రాష్ట్రప్రభుత్వములే లేవు. శానససభలుగల రాష్ట్రములే లేవు. ఆదేశములన్నిటిలోను ఒకే ప్రభుత్వము గలదు. అది జాతీయ ప్రభుత్వము. కావున అదేశముల ప్రభుత్వలు, సంయుక్త ప్రభుత్వములుగావు. కనడా దేశములో రాష్ట్రముల కన్నిటికిని శాసనసభలు గలవు. పైన జాతీయప్రభుత్వము గలదు. దానికి రెండు శాసనసభలుగలవు, అయితే జాతీయప్రభుత్వమును రాష్ట్రప్రభుత్వమును ఒకే చట్ట ప్రకారముఏర్పడినవి గావున రాష్ట్ర ప్రభుత్వములకు నిర్దిష్టమైన యుధికారములును మిగిలిన సర్వాధికారమును జాతీయ ప్రభుత్వము నకును గలదు. రాష్ట్ర ప్రభుత్వములు జాతీయ భుశ్వమునకు సంపూర్ణముగ లోబడియున్నవి. కెనడా" కూడ సంయుక్త (Federal) ప్రభుత్వమని యే చెప్పవచ్చును. ఆస్ట్రేలియాకూడ కనడాను బోలిన సంయక ప్రభుత్వమే కలిగి యున్నది. ప్రస్తుతము ఆంగ్లేయ పాలనము కింద హిందూ దేశములో శాసనసభలుగల రాష్ట్ర ప్రభుత్వములును వీటి పైన రెండుశాసనసభలుగల జాతీయ ప్రభుత్వమును గలవు. ఇచట గూడ కనడా, ఆస్ట్రేలికూలవలే రాష్ట్రీయ ప్రభుత్వములకు. నిర్దిష్టమైన అధికారములును జూతీయ ప్రభుత్వమునకెక్కువ అధికారములు గలవు. కాని హిందూదేశములో జాతీయ ప్రభుత్వమునకు గూడ సంపూర్ణమగు అధికారములు లేవు. హిందూదేశ ముమీద సంపూర్ణ మగునట్టియు అనిర్దిష్ట మైనట్టియు అధికారములు లండను