పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

209


లోని ఆంగ్లేయ పార్లమెంటు నకుమాత్రమే గలవు, , హిందూ దేశమునకు స్వరాజ్యము లేదు. ఆంగ్లేయ పార్లమెంటు యొక్క పరిపాలసకులోబడి, హైందవ జాతీయ ప్రభుత్వమును రాష్ట్ర ప్రభుత్వమును నిర్దిషమగు అధికారములను చలాయించు చున్నవి. హిందూదేశము స్వరాజ్యము పొందినతరువాత కనడా, ఆస్ట్రేలియాలలో వంటి సంయుక్తప్రభుత్వము నేర్పరచు కొనునో అమెరికా సంయుక్త రాష్ట్రములలోవంటి సంయుక్త ప్రభుత్వము నేర్పరచుకొనునో చెప్పుటకు వీలు లేదు.

కాంగ్రెసు.


అమెరికా సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వము మూడుభాగములు గలది. మొదటిది. శాసనస్సభలు. దోనికి కాంగ్రెస్ అని పేరు శాసన సభలు రెండుగలవు. ఒకటి కజాప్రతినిధిసభ (House of Representatives,) రెండవది శిష్టసభ (Senate) ప్రజా ప్రతినిధి సభలో 43 మంది సభ్యులుగల . రెండు సంవత్సర ముల కొరసారి ఎన్నికలు జరుగును. దేశములోని రాష్ట్రము అన్నిటిలోను షుమారు రెండు లక్షల పదకొండు వేల జనులకొక ప్రతినిధి చొప్పున ఎన్నుకొనుటకు జిల్లాలుగా పంపిణీచేయబడినది. ప్రతినిధి ఇరువది ఐదు సంవత్సరములకు తక్కువ లేని వయసు గలవాడుగను, సంయుక్త రాష్ట్రములలో ఏడుసంవత్సరములు పౌరుడుగను, ఎన్నుకొనబడిన కాలమున ఎన్నకొస బడిన రాష్ట్రములో . కాపురస్తుడుగను, ఉండి తీరి వలెను. 'ఓట్ల ఎన్నిక హక్కులు రాష్ట్ర ప్రభుత్వములే నిర్ల యించును , అన్ని రాష్ట్రములలోను ఇరువది యొక్క సంవత్స రములు దాటిసపురుషులగు పౌరులకందరకును ఓట్లు (ఎన్ను