పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

207

ఎనిమిదవ ఆధ్యాయము


హారములు, ట్రేడు మార్కులు, కాపీరైటులు, నాణెముల, కరెన్సీనోట్లు, ( కాగితవు ధనము, ) జాతీయ ప్రభుత్వముపై నేరములు, సముద్రముల మీద నేరములు, దివాలా చట్టము, పౌరసత్వపు హక్కులు, సంయుక్త ప్రభుత్వపు రాజధాని లోను, వారి కోటలు, గిడ్డంగులు, నౌకా నిర్మాణశాలలు, మొదలగు ప్రదేశములలోను సమస్త శాసనములు చేయట, మొదలగు ఆకారములు జాతీయ ప్రభుత్వమునకు గలవు. 'రాష్ట్రములోని పౌరులకు సంబంధించిన సమస్తయితః విషయములలోను, శాసనములుచేయు అధి కొరకు రాష్ట్రప్రభుత్వముల కుండును. అనగా స్థానిక స్వపరిపాలన ; విద్య ; దాయ భాగము; దండనా సవములు; (క్రిమినలు లా; ) ధర్మస్మృతి; (సివిలు లా; ) పోలీసు; శాంతి సంరక్షణము; వివాహము; కంట్రాక్టుల ; భాగస్వాములు ; ఏజంట్లు; ఓటర్లు ; భార్యా భర్తల తండ్రి పిల్లలు యజమాని నౌకరుల సంబంధములు ; భీమా ; ఋణములు ; రాష్ట్రములోని పరిశ్రమలు; వర్తక వ్యాపారములు ; ఆస్థి పంపకము ; మొదలగు 'సమస్త విషచుములలోను శాసించుటకు రాష్ట్ర ప్రభుత్వములకే అధికారము గలదు. రాష్ట్రముల వ్యక్తిత్వము చెడకుండ రాష్ట్ర ప్రభుత్వములు జరుగుచు, రాష్ట్రములన్నియు కలిసి యేర్పాటు చేసుకున్న జాతీయ ప్రభుత్వమునకు సంయుక్త (Federal) ప్రభుత్వమని పేరు. ఇవియే అమెరికా సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వమునకును ఇతర జేశముల ప్రభుత్వములకును భేదము.