పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

203


యాక్త ప్రభుత్వము బలపడనిచో ననేక నష్టనులు కలుగునని అనుభవము కూడనన్ని రాష్ట్రములకును క్రమముగా తోచెను. 1787 వ సంత్సరము మే నెలలో ఫిలడల్ఫియా నరమును సంయుక్త ప్రభుత్వ విధానమును సం యక్త ప్రభుత్వమునకును రాష్ట్రప్రభుత్వములకును 'గలసంబంధమును నిర్ణయించుటకు పన్నెండు రాష్ట్రములనుండి ఏబది అయిదుగురు " ప్రతినిధులు సమావేశ మగునట్లు ఏర్పాట్లుగావింపబడెను.

. ఆసమావేశమునకు జార్జి వాషింగ్ట నధ్యక్షత వహించెను. రెండుమూడు నెలలు పెక్కుమారులు సమావేశములు జరిగి వివిధ విషయములు బాగుగ చర్చించబడి ప్రస్తుతమున్న పద మూడు రాష్ట్రములకును ఇకముందు ఏర్పడబోవు రాష్ట్రములకు ను నర్తించునట్లుగ నొక ముయుక్త ప్రభుత్వ విధానమును , తయారుచేసిరి.

జార్జి
వాషింగ్టను
అధ్యక్షుడగుట.


దానిని 1787వ సంవత్సరము 20వ సెప్టెంబరు తేదీన దేశీయదుహాసభ వారంగీక రించి వివిధరాష్ట్ర ప్రభుత్వములకంచగ వారొటొకటి చొప్పున అన్ని రాష్ట్రములవారుసు అం గీకరించి దస్కతులు పెట్టిరి. 1789 సంవత్సరము జనేవరి 7వ తేదీన నూతన రాజ్యంగ విధాన ప్రకారమెన్నికలు జరిగి అమెరికా సంయుక్త రాష్ట్రములౌ ప్రథమ అధ్యక్షుడిగా జార్జి వాషింగ్ట నెన్న కొనబడెను. అమెరికామ సురక్షితముగ నడిపించుటకు జార్జి వాషింగ్టను కన్న అర్హులెవరు ! ఉత్కృష్టమగు ఆదర్శములను కలిగి?