పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

ఆమెరిగా పంయుక్త రాష్ట్రములు



యుంచుటయే కాక, అయకు విశేషమగు లోకానుభవము కూడనుండెను. తన సర్వస్వమును తన దేశముయొక్క ఘనత కొరకై అర్పించుటయే గాక , . తన దేశము యొక్క భావ్య దృష్టమునందును గొప్పదనము నందును సంపూర్ణమగు విశ్వాస మును కలిగి యుండెను. ఆయన కాంక్షించక పోయినను ఆయన నేక గ్రీవముగ : అద్యక్షునిగ నెన్ను కొనుట వలన ఆయన చేసిన మహత్తరమగు దేశ సేవకు కృతజ్ఞత చూపినట్లయ్యెను. ఆయన రాచకీయకక్షుల కతీతుడై దేశమును బహువిధముల అభివృద్ధి నొందించి "రెండవమారుకూడ నగ గ్రీవముగా మధ్యక్షుడుగ నెన్న కొన బడెను. మూడవసారికూడ అధ్యక్షత పదవి నివ్వగా సాయన స్వీకరించుటకు నిరాకరించెను.


(2)

సంప్జుర్ణ ప్రజా
స్వామికము.


అమెరికా సxx క్త రాష్ట్రములు ఆంగ్లేయ ప్రభుత్వమునుండి చీలిపోయిన తరువాత సంపూర్ణ ప్రజాస్వామికము నేర్పరచుకొనెను వారి రాజ్యాంగ విధానములో రాజు లేడు. ప్రభువులు లేరు. ప్రభువుల సభ లేదు. ప్రభు బికుదము మొదలగు బిరుదములను రాజ్యములోని పౌరుకెవరికివి యివ్వరు. బిరుదముల నెవరును దరించరు. మానవులా గౌరవము వారు పొందు బిరుదములనుబట్టి గాక సమర్దత యోగ్యతల వలననే గలుగువని వారి యభిప్రాయము, పరిపాలన 1787 వ సం వత్సరమున జార్జి వాషింగ్టను గారిచేత లిఖతముగా నిర్ణయించ బడిన రాజ్యంగ విధానమునుబట్టియే నేటికిని జరుగుచున్నది, అందులో ఏదైన మార్పులు కావలసియున్నచో మార్పులు