పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

అమెరికా సంయుక్త రాష్ట్రములు


. అసూయలును, నిండి యుండెను. ఉత్తర రాష్ట్రముల వారికిని, దక్షిణ రాష్ట్రముల వారిని, తీవ్రమగు భేదాభి, పాయము లుండెను, వారి లాభ నష్టములు వేరుగను,, వీర లాభనష్ట ములు మరియొక విధము నను నుండెను


కావున పదమూడు రాష్ట్రమును కలిపి నుంచి నాటి కన్నిటికిని అనువగు సంయుక్త ప్రభుత్వమును స్థాపించుట కష్ట తరమగు కార్యముగ నుండెను. దేశీయ మహాజన స భ దేశ మ నంతను పాలించుటకు తగినంత అధికారము తోడసు కట్టు దిట్టముల తోడను కూడి యుండలేను. శత్రువుపై ప్రజలకుద్రేమును పురిగొలిపి స్వతంత్రమును స్థాపించుటడు మాత్రమే తగియుండెను - యూద్దకాలములో శత్రుపై నందు గల ద్వేషము వలనను స్వతంత్రేచ్చ వలసను రాష్ట్రములన్నియు ఐక్యత నొందెను. బుద్దము ముగిసిన తరువాత సట్టి ఐక్యత నిలుచుట కష్టముగ నుండెను.. దూరదృష్టిగల నాయకు లందరుసు యీ విషయములో నాత్రతను, గలిగి యుండిరి. ప్రధాన నాయకుడగు జార్జి వాషింగ్టము సర్వ సేనా పత్యముపదలి వైచుటకు ముందు ఈ విషయమును గూర్చి అన్ని రాష్ట్రముల పతినిధి సభలకుసు వ్రాసెను. అన్ని రాష్ట్రములును కలిసి యొకే ప్రభుత్వము క్రింద పని చేసిన గాని అభివృద్ధిని గొప్పతన మును పొంద నేర వనియు, చీలిపోయి యెపరికీ వారు స్వతంత్ర ముగా నున్నచో సంపాదించిన స్వతంత్రము యొక్క లాభమును విశేష కాలమనుభవించ నేరరనియు హెచ్చరించెను. బందోబస్తగు నౌక 'రాజ్యాంగ విధానమును తయారు చేసి కొని దానికి లోబడుట యవశ్యకమని సలహా నిచ్చెను.