పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమెరికా సంయుక్త రాష్ట్రములు.

సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వము.

తొమ్మిదవ అధ్యాయము , (1)

పరిపాలనా
 భారము


స్వతంత్రము పొందిననాటికి సంయుక్త రాష్ట్రముల"ఆంతరంగిక వ్యవహారముల సంతృప్తి కర ముగా నుండెను. ప్రజలు స్వతంత్రమును సంపాదించుకొనిరే గాని చక్కని పద్ధతులమీద స్వపరిపాలనను నిర్మాణము చేసికొనుటకు తయారై యుండ లేదు. గొప్ప ఆదర్శములు కలిగి స్వతంత్ర పోరాటములో నాయకులుగా పని చేసినవారిలో కూడ చాలమంది నూతన సభుత్వ మును నడుపుటకు తగిన యనుభవము, లేనివారినియే చెప్పక తప్పదు. అంతవరకును ఆంగ్లేయ ప్రభుత్వము వారిచే నియమింప బడినవారిని ఎదిరించుటకే అలవాటు పడియుండిరి గాని తాము స్వయముగా జవాబు దారి సహించి ప్రభుత్వము నడుపు అవకాశం లేనివారై యుండి ఇపుడు ఆంగ్లేయ ప్రభుత్వము పోయి దేశమును సరిగా పాలించు భారము వారి మీద వడినది. రాష్ట్రములలో పరస్పర మనస్పర్థలును , ల