పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

191




రాజభక్తుల కెట్టి సురక్షణయు నివ్వక రెండవక క్ష వారి యనుగ్రహమ నకు వానిని వదలి పెట్టుట అక్రమమని చెప్పిరి. నూతనమంత్రుల చర్యలను తీవ్రముగ విమర్శించిరి. తుడ కొకయుపసంఘ మేర్పాటై అమెరికను రాజభక్తులకు కొంత నష్టపరిహార మిచ్చుటకును సైశ్యములలో చేరిన రాజభక్తులకు సగముజీతము లిచ్చుటకును తీర్తానింపబడెను. ఒక కోటి యిరువది లక్షల సవరసులు ఆంగ్లేయ ప్రభుత్వముచే అమెరికను రాజభక్తుల కివ్వబడెను.

అమెరికను సైనికులకు
దేశస్వాతంత్రమును
సంపాదించితిమనుత్రుప్తి.

అమెరికను వారి సైన్యములు జీతములకు తొందర చేయుచుండెను. 1780 సం. స సైనికోద్యో యుల కందరకును యావజ్జీవమును సగము జీతము ను పింఛనుగ, (ఉపకార వేతనముల) నిచ్చుటకు వాగ్గత్తము చేయబడెను.ఆప్రచార మిచ్చుటలేదు. తగినంతమంది రాష్ట్రము వారంగీకించను లేదు. దీనికి బదులుగ కొంత సొమ్ము మొత్తముగనైన యివ్వమని సైగికోద్యోగులు కోరిరి. దీనికిని దేశీయ మహాసభవారు ప్రత్యుత్తర మివ్వలేదు.


సె నికోద్యోగులు అంతఃకలహమును ప్రారంభించుటకు తీర్మానము చేయుటకు గాను సమావేశ మైరి. వాషింగ్టను అక్కడికి వచ్చి తొందర పడవద్దనియు వారియొక్క హక్కులకై తాను సర్వవిధముల శృషి చేసెదననియు చెప్పి సమా వేశమును సమాప్తి చేయించెను. మరునాడే సంధిషరతు లపై సంతకము లయినవనువార్త చేరెను. మరియొక