పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

అమెరికా సంయుక్త రాష్ట్రములు


సంది షరతులాఇ
సంతకము
చేయబడెను.

మధ్య సంధి యొడంబడికలు కుదిరి చిత్తు షరతుల పై సంతకములు చేసుకొసిరి. (1) అమెరికా వలసరాష్ట్రములు సంపూర్ణముగ స్వతంత్ర దేశమయినదని యగీకరించబడెను. (2) ఈ వలస రాష్ట్రములకును ఆంగ్లేయుల రాజ్యములో చేయ స్న కనడా దేశమునకును మధ్య సరిహద్దు నిర్నయించబడినది. (3) ఆంగ్లేయులును పరాను పోరును స్పైన్ వారును యుద్ధ కాలములలో నొకరివద్దనుండి యొకరు జయించిన ప్రదేశములను తిరిగి యిచ్చి వేయవలెను. ఆఫ్రికాఖండమున ఆంగ్లేయులును పరాసువారును కొంత ప్రదేశమును మార్చుకొనిరి. (4) హిందూదేశములోలోని నాగపట్టణమును ఆంగ్లేయులు తీసుకొని 'హాలెండు వారితో ని దేవిధమైనన నాంగ్లేయ ప్రభుత్వమువారు రాజీపడిరి. (5) అమెరికాలోని రాజభ క్తులయందు న్యాయమును కరుణయు కనపరచవలసిందని అమెరికా దేశీయ మహా సభవారికి సిఫారసు చేయబడినది. (6) టిప్పు సుల్తానుకును "అగ్లేయులకును యుద్ధము జరుగుచుండగ నీసంధివర్తనూనము తెలసి పరాసువారు టిప్పుసుల్తానును వదలి వెళ్ళిపోయిరి. టిప్పు సుల్తాను మంగళూరును పట్టుకొని తరువాత ఎవరు జయించి నది వారు విడిచి వేయ షరతుతో నాంగ్లేయులతో 1784 వ సంవత్సరం మార్చి నెలలో రాజీవ డెను.

రాజభక్తులకు
నష్టపరిహార
మిచ్చుట


పార్ల మెంటులో నీ రాజీనామాలనుగూర్చి చర్చ జరిగినపుడు వెనుక ప్రధానమంత్రి పదివిని త్వజించిన నార్తు ప్రభువును ఫాక్సు మొదలగు సభ్యులును సంధిషరతులను ఖండించిరి.