పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

ఆమెరికాసంయుక్త రాష్ట్రములు


నెలలోపల యుద్ద మంతరించినదని: దేశీయ మహాసభ వారు ప్రచురించిరి. 'సేనలకు జీతము లిచ్చుటకు దవ్యము లేదు. చాలవరకు వాషింగ్టను సైనికుల నూరకనే యిండ్లకు పంపి వేసెను. దేశ స్వాతంత్యమును సంపాదించితి మనుతృప్తి కంటె దవ్యము ముఖ్య విషయము కాదని చాలమంది జీతమును కోరరనే సంతోషముగ గృహములకు వెడలిపోయిరి. పెన్ని సీల్వానియానుండి వచ్చిన యొక సేన ఫిలడల్ఫియాలో నున్న 'దేశీయ మహాజన సభామందిరమును ముట్టడించి తమకు వెంటనే రావలసిన సొమ్ము నివ్వనిచో మహా సభ వారిమీద పగతీర్చుకొంకుమని బెదరించిరి. వాషింగ్టను మరియొక సైన్యమును బంపి వీరిని చెదరగొట్టి వీరిలో ముఖ్యులను ఖయిదుచేసెను. ఈవిధమున ససంతృ ప్తివలన నక్కడక్కడ సైనికులు తిరుగబాటులు చేయుచుండగ వాషింగ్టను తిరుగ బాటులను కొన్ని చోటుల మంచిమాటలతోడను గొంతమందికి కొంత దవ్వ మిప్పించియు కొన్ని చోటుల శిక్షించి బెదిరిం చియు నేర్పుతో నణచి వేసి శాంతి పూర్తిగ నెలగొలిపెను ,

సంధియొడంబడికెలు
స్థిరపడినవి.

1788 ప సంవత్సరము సెప్టెంబరు 3వ తేదీన ఇంగ్లాండు, ఆమెరికా, ఫ్రాంసు, స్పైన్, హాలెండు దేశముల మధ్య జరిగిన సంధి యొడంబడికెలన్నియు స్థిరపర్చబడెను. అందరును సంధిపత్రములపై సంతకములు చేసిరి. అమెరికా దేశము స్వతంత్రమును సంపాదించెను. ప్రొస్సు దేశ మీస్వాతంత్ర సంపాదనమునకు ముఖ్యముగ తోడ్పడెనను కీర్తిని వడసెను. ఆంగ్లేయ సేవలు అమెరికాను విడిచి వెళ్ళెను. అమెరికా వారు స్థిరపడినది.