పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

అమెరికా సంయుక్త రాష్ట్రములు


యార్కు టౌను వద్ద
అమెరికనులకు
గొప్ప జయము. కారన్
వాలీసు ప్రభువు
లోబడెను.

యార్కుటౌను వద్ద మంచి యేర్పాటులను చేయుచుండెను." అమెరికనులకు గొప్ప కొన్ని సెన్యములు పశాను దేశమునుండి జయము, పచ్చిదిగెను. పరాసు, దేశమునుండి ఇరువది లక్షల లివరీల ధనముకూడ వచ్చిచేరెను. పరాసు సైన్యములును ఆమెరికను సైన్యములును కలసి న్యూయార్కును ముట్టడించెను. వాషింగ్టన్ యోచించెను. కాని లఫయతు నేనానియు పరాసు సైన్యముల సేనాధ్యక్షుడగు రోషంబోయును యార్డు టౌను మీదికి వెడలుటదీయుట యుక్తమని సలహానిచ్చిరి. యర్డు టౌనును సముద్రము వైపునుండి డిగ్రాసీ ప్రభువు కిందనున్న పరాసు నౌకాదళముకూడ ముట్టడింపవచ్చునని తలచిరి. దీనికి వాషింగ్టన్ కూడ సమ్మతించెను. ఆగస్టు 21 వ తేదీన పరాసు, ఆమెరికను సేనలు వాషింగ్టను, ఆఫయతు, రోషంబో సేనా నులకింద బయలు దేరెను. 28, 24, తేదీలను హడ్సను నదిని దాటెను. వీరు వచ్చి న్యూయార్కు మీద పడుదురే మోనని న్యూయార్కులోని యాంగ్లేయ సేనలు సిద్ధపడుచుం డునేగాని న్యూయార్కు నువదలి వీరిని ముట్టడించటకు సాహ సించ లేదు. పరాను అమెరిక ను సేన లప్రతిహతముగ సాగి. పోవుచుండెను. తోవలో వాషింగ్టను స్వగామ మగు మాంటు వెర్నను దాటి సెప్టెంబరు 14 వ తేదీన విలియమ్సు అగ్గును చేరెను. సెప్టెంబరు 28 వ తేదీన నీ సైన్యమంతయు యార్కుటౌనుకు రెండు మైళ్ళ దూరమున విడిసెను. పరాను వారిసేనాని డిగా సి ప్రభువు ఇరువది ఎనిమిది యుద్ధనౌకలతో బయలు దేరి. తోవలో యూరవునకు వెడలిపోవుచున్న