పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

177


క్రింద నాంగ్లేయ సేనలు ముట్టడించెను, అమెరికను లోడిపోయిరి. రాడన్ ప్రభువు మొదట అమెరికన్ 'సేవాని గ్రీసను తరుము చుండెను. ఈ మధ్యను లీ, "మేరియన్ సేనానులకింద నమెరికను సేనలు వచ్చి రాడను నాటంక పరచెను. రాడన్ వెను కకుమరలి పాంటీ నది యొడ్డునే పోవుచుండెను. దక్షిణ కారో'లీనా రాష్ట్రములోని వాయవ్య భాగమంతయు సమెరికనుల వశమయ్యెను. రాడు నిలువ నీడదొరకక నమెరికన్ సైన్యములచే నలువైపులనుండియు తరుమబడి కొలదికాలములో నా రాష్ట్రమును వదలి ఛార్జెస్టన్ ను చేరెను. రాజు భక్తులతో తాను వారిని సంరక్షించలేననియు వారి తిప్పలు వారే చూచుకొమ్మనియు చెప్పి వెళ్ళెను. అక్కడ జబ్బుపడి యుద్ధములో విసికి రాడన్ ప్రభువు ఇంగ్లండునకు పయనమై పోయేను. దక్షిణ కారొలీనా రాష్ట్రములో చాల భాగము సమెరికను సేనాని గ్రీను వశ పరచుకొ నెను. పాంటి, ప్రాతముల మాత్రమే ఆంగ్లేయు లింకను యుండిరి. ఈ రాష్ట్రము నుండి కారస్ వాలీసు ప్రభువు వర్జీనియాకు పోవుటవలన నదివర కాం గ్లేయులు పొందిన జయములన్నియు మాసిపోయెను. "ఇచట తగినంతమంది రాజభక్తులు తమ పక్షమున పోరా డుదురు గాని, పోరాడిసను ప్రయోజనము కలుగునవిగానీ, ” అయనకు నమ్మకము లేక నీరాష్ట్రమను విడిచి వెళ్ళెను. దేశమును జయించుట కొంగ్లేయ సైన్యము చాలదే మెనని కూడా నాయనకు సందేహము కలిగెను, మే నెలలో నాంగ్లేయ పార్లమెంటు సమావేశ మైసవుడు, పిట్టు, ఫాక్సు, మొద లగు సభ్యులు కారస్ వాలీ సు ప్రభువు పంపిన నివేదికసు బట్టి - -