పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

అమెరికా సంయుక్త రాష్ట్రములు,


సైన్వముతో వెడలిపోయెను. కాని యుద్దమందు ఆంగ్లేయు లే ఎక్కువ సష్టమొందిరి. విశేషముగ నికులను కారస్వాలీసు పోగొట్టుకొనెను. అందువలన కాన్వాలీసు సైనికులతో మరలి పోవుచుండగ గ్రీన్ నూతన సైన్యములతో వెంబడిం చెము, కారన్ వాలీసు శీఘ్రముగా నుత్తర కాకొలీనా రాష్ట్రమునంతను నమెరికనులకు వదలి సమద్రతీరమూ నున్న విల్మింగుటనును జేరెను. ఇటనుండి వర్జీనియా రాష్ట్రము నకు పోవసుద్యుక్తుడయ్యెను నర్జీనియాలోని ఆంగ్లేయ సైన్యములు పైకి పరాసు ప్రభువగు లఫయతు సేనాని వెడలెను, లఫ యతు జీతము పుచ్చుకొనండ వాషింగ్టన్ కింద పని చేx: చుండెను. ఈయన కింద వున్న సైనికులకు జీతము గాని సరియైన తిండిగాని దుస్తులుగాని లేకుండెను. ఈయన స్వంత ముగ రెండు వేల సవరనుల ఋణముచేసి తనకింది సైనికులకు అవసరమగు 'నేర్పాటులనెల్ల జేసి, ఆ ప్రాంతములలోని ఐచ్చిక సైనికులను గూడ చేర్చి ఆంగ్లేయుల ను ముందుకు రాకుండ నాటంక పరుప గలీ గెము. ఏక్రియల్ నెల చివర భాగమున ఆంగ్ల సేనాని కారన్ వాలీసు ప్రభువు పదునాలుగు వందల సైనికులతో విల్మింగుట ను వదలి వర్జీనియాలోని పీటర్సు బర్గును చేరెను. "కారన్ వాలీసు వెడలిపోయిన తరువాత దక్షిణకొరొలీకా, జర్షియా రాష్ట్ర ములను స్వాధీనమును పొందుటకు అమెరికను సేనాని గ్రీన్ ప్రయత్నములను చేసెను. ఆ ప్రాంతములలోని వివిధ భాగములకును తగిన సేనలను పంపెను. తాను కాండం పైకి వెడలెసు. ఏప్రియల్ 18 వ తేదీన ఈయనను రాడన్ ప్రభువు A